Begin typing your search above and press return to search.

కబాలి.. ఫీలయిన రాజమౌళి

By:  Tupaki Desk   |   22 July 2016 7:28 AM GMT
కబాలి.. ఫీలయిన రాజమౌళి
X
స్టార్ హీరోలపై వారి ఫ్యాన్స్ కు ఉన్న అభిమానం గురించి రాయాలంటే.. పుస్తకాలు గ్రంథాలు కూడా సరిపోవు. ఇక తమ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే.. ఇక ఆయా ఫ్యాన్స్ సంబరాలు అంబరానికి అతి దగ్గరలో ఉంటాయి. కానీ స్టార్ హీరోలందరూ ఓ వైపు.. రజినీకాంత్ ఒక్కడు ఒకవైపు అన్నట్లుగా ఉంటుంది ఆయన క్రేజ్. అందుకే ఎంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న వారు కూడా.. సూపర్ స్టార్ కి అభిమానులు అయిపోతారు.

అందుకే రజినీకాంత్ సినిమా కబాలి రిలీజ్ అనగానే 15 రోజులు ముందుగానే సందడి మొదలైపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డం కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూశారు. ఇలాంటి వారిలో మన దర్శకధీరుడు రాజమౌళి కూడా ఉన్నాడు. కానీ కబాలిని తొలి ఆట చూడలేకపోయాడు జక్కన్న. ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ తన బాధను పంచుకున్నాడు కూడా. 'బాహబలి2 షూటింగ్ కారణంగా కబాలి మొదటి రోజు మొదటి ఆట చూడలేకపోయా. థియేటర్ లో ఉంటే కనుక.. ఇప్పటికే నేను కూడా తలైవా మేనియాలో కూరుకుపోయేవాడిని' అంటూ ట్వీట్ చేశాడు జక్కన్న.

రాజమౌళి తీసిన మూవీ బాహుబలి రికార్డులకు కబాలి ఎర్త్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ల రికార్డు కబాలి ఖాతాలోకి వచ్చేయగా.. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా కబాలి పేరుపైకి మారిపోయే చాన్సులు ఫుల్లుగా ఉన్నాయి.