Begin typing your search above and press return to search.

విక్రమార్కుడు పరిస్థితి దారుణం!!

By:  Tupaki Desk   |   5 May 2016 10:30 PM GMT
విక్రమార్కుడు పరిస్థితి దారుణం!!
X
రాజమౌళి తీసిన అన్ని కమర్షియల్‌ సినిమాల్లోకి.. కాస్త టఫ్‌ అండ్‌ రేసీగా అనిపించే సినిమా ''విక్రమార్కుడు''. అటు అత్తిలి సత్తిగా.. ఇటు విక్రమ్‌ రాథోడ్‌ గా మాస్‌ రాజా రవితేజ నటన అద్భుతం. ఆ వేరియషన్‌ జస్ట్ అమేజింగ్‌ అంతే. అయితే ఈ సినిమాను 'మా' టివిలో వేసినప్పుడల్లా.. 50% మంది కేవలం ఆ సెకండాఫ్‌ లో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కోసం చూస్తుంటారు. మిగిలిన సగం ఫస్టాఫ్‌ లో సీన్లు ఎంజాయ్‌ చేస్తారు.

ఇప్పుడు ఈ విక్రమార్కుడు డిస్కషన్‌ ఎందుకు పెట్టాం అనేగా మీ సందేహం. నిజానికి అప్పట్లో మా టివి లో రెగ్యులర్‌ గా విక్రమార్కుడు సినిమాను చూసే అభిమానులకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. అదే మన సెన్సార్‌ బోర్డు. సినిమాలోని డైలాగులను మ్యూట్‌ చేస్తేనే.. దీనిని రెగ్యులర్‌ టైమ్‌ లో టెలికాస్ట్‌ చేయడానికి అవకాశం ఉంది. సో.. ఛానల్‌ వారు డబుల్‌ మీనింగ్‌ డైలాగులన్నీ కట్‌ చేసేశారు. అదేలేండి.. కేవలం సౌండ్‌ తీసేశారు. కాని ప్రతీ సీన్‌ లోనూ చాలా డైలాగులు లేపేశారు. హీరో చెప్పేవి.. హీరోయిన్‌ చెప్పేవి.. విలన్లు చెప్పేవి.. చాలా ఎగరిపోయాయ్‌. దాదాపు సగం సినిమాను మాటలు లేకుండా చూడాల్సిందే. ఎంత దారుణమో కదా.

అయినా.. మన రాజమౌళి ఇన్నేసి డబుల్‌ మీనింగులతో అప్పట్లో సినిమాలు తీశాడనమాట. దాదాపు ప్రతీ సీన్‌ లో నూ నాలుగైదు డైలాగులు మ్యూట్‌ చేసేశారంటే.. ఇక మీరే ఆలోచించుకోండి.