Begin typing your search above and press return to search.

క్లైమాక్స్ నచ్చలేదన్న జక్కన్న

By:  Tupaki Desk   |   23 May 2019 4:37 AM GMT
క్లైమాక్స్ నచ్చలేదన్న జక్కన్న
X
సాధారణంగా ఏదైనా సినిమా గురించి తనకు నచ్చినప్పుడు ఓ ట్వీట్ పెట్టి మద్దతు పలికే రాజమౌళి ఈసారి ఓ సీరియల్ గురించి మాట్లాడటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా హెచ్బిఓ ఛానల్ ద్వారా కోట్లాది అశేష అభిమానులను సంపాదించుకున్న గేమ్ అఫ్ త్రోన్స్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఎనిమిది సీజన్ల పాటు సాగిన ఈ టెర్రిఫిక్ సిరీస్ ని ప్రేక్షకులు ఊహించని క్లైమాక్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు.

ఇది అధిక శాతం జనానికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. మళ్ళి రీ షూట్ చేయమంటూ ఆన్ లైన్ పిటీషన్లు పెట్టే దాకా వెళ్ళింది వ్యవహారం. దానికి అవకాశం లేనప్పటికీ గేమ్స్ అఫ్ త్రోన్స్ ని తామెంత ప్రేమించామో దాని ద్వారా వాళ్ళు రుజువు చేశారు. దీనికి మద్దతు పలికినా పలకకపోయినా రాజమౌళి తనదైన శైలిలో దీని గురించి అభిప్రాయం వెలిబుచ్చాడు

పదేళ్ళపాటు అద్భుతమైన భావోద్వేగాలను రేకేత్తించి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనుభూతి కలిగించారని ఇలాంటి స్టొరీ టెల్లింగ్ ని భవిష్యత్తులో ఎవరు చేయాలనుకున్నా మీరే ఆదర్శంగా నిలుస్తారని కితాబు ఇచ్చాడు. అయితే సీజన్ 8లోని చివరిదైన 6వ ఎపిసోడ్ తనకూ నచ్చలేదని కుండబద్దలు కొట్టేశాడు. అయితే దర్శక నిర్మాతలు ముందు నుంచి దీనికి ప్రిపేర్ చేస్తూ వచ్చారని అది గుర్తించాలని కోరాడు.

ప్రతి కథకు మంచి ముగింపు సాధ్య పడదని ఒకవేళ అదే ఆశిస్తే మనం సిరీస్ సరిగా ఫాలో కాలేదని లాజిక్ గుట్టు విప్పాడు. ఏదైతేనేం తమ ఒపీనియన్ తో రాజమౌళి మాట కూడా ఒకటే కావడంతో నెటిజెన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రెండో షెడ్యూల్ కోసం రెడీ అవుతున్న జక్కన్న దాని వివరాలు మరికొద్ది రోజుల్లో ఆన్ లైన్ లోనే వెల్లడించే అవకాశం ఉంది