Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ఈ ఏడాదే ఉండొచ్చట

By:  Tupaki Desk   |   7 Feb 2016 7:30 AM GMT
బాహుబలి-2 ఈ ఏడాదే ఉండొచ్చట
X
బాహుబలి: ది కంక్లూజన్ ఎప్పుడు విడుదలవుతుందా అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల వచ్చిన వార్తల ప్రకారమైతే ఈ ఏడాది ఆ సినిమా విడుదల కావడం అసాధ్యమే అన్న నిర్ణయానికి వచ్చేశారు జనాలు. ఐతే రాజమౌళి తాజా వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే మాత్రం.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ ఏడాదే సమాధానం దొరికినా దొరకొచ్చేమో అనిపిస్తోంది.

ఈ మధ్య ఓ నేషనల్ టీవీ ఛానెల్ తో మాట్లాడిన జక్కన్న బాహుబలి: ది కంక్లూజన్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు. తొలి భాగం తీసేటపుడు రెండో భాగానికి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తి చేశామని.. ఇక డిసెంబర్ లో షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటిదాకా ఇంకో పది శాతం అవగొట్టామని.. మొత్తంగా 40 శాతం సినిమా సిద్ధమైందని అన్నాడు. షెడ్యూళ్లన్నీ అనుకున్న ప్రకారం పూర్తయితే ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఈ ఏడాది ఆఖర్లోనే విడుదలయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేమని చెప్పాడు రాజమౌళి.

ఈ ఏడాది ఆఖరుకు కుదరకపోయినా 2017 మొదట్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని జక్కన్న చెప్పాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు.. బాహుబలి-దేవసేన పూర్వ వృత్తాంతం అంతా రెండో భాగంలో చూపిస్తామని జక్కన్న వెల్లడించాడు. మరి జక్కన్న అన్నట్లు షెడ్యూళ్లన్నీ అనుకున్న ప్రకారం పూర్తవుతాయో లేదో చూడాలి.