Begin typing your search above and press return to search.

రానాను మిస్ అయ్యావు జక్కన్న

By:  Tupaki Desk   |   27 March 2017 5:44 AM GMT
రానాను మిస్ అయ్యావు జక్కన్న
X
పేరుకు ప్రతినాయకుడే అయినా.. బాహుబలి చిత్రంలో రానా పాత్రకు ఉండే ప్రాధాన్యతను ఎంతమాత్రం తగ్గించి చూడలేం. ఒక సినిమాలో హీరోకు సమానంగా కాకున్నా.. కాస్త దగ్గరగా విలన్ పాత్రను సైతం..వావ్ అనేలా మలిచిన ఘనత రాజమౌళితో పాటు రానాకు కూడా ఉంటుందని చెప్పక తప్పదు. బాహుబలి సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ప్రస్తావించినంతనే.. రానా గురించి కూడా చెప్పక తప్పదు.

తాజాగా జరిగిన బాహుబలి 2 కంక్లూజన్ ప్రి రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు రాజమౌళి చాలామంది పేర్లను మిస్ కాకుండా ప్రస్తావించారు. ఒకవిధంగా చెప్పాలంటే తెర వెనుక హీరోల్ని ఆయన పరిచయం చేశారు. తనను నమ్మి సంవత్సరాల పాటు తనకు టైం ఇచ్చేసిన ప్రభాస్ కు తానేం ఇచ్చానన్న విషయాన్ని.. రాజమౌళి ప్రత్యేకంగా చెప్పారు.

ఇదంతా బాగానే ఉన్నా.. భల్లాలదేవుడు అలియాస్ రానా గురించి మాత్రం చెప్పటం మిస్ అయ్యారు. మిగిలిన అందరి పేర్లను హడావుడిగా అయినా ప్రస్తావించినప్పటికీ.. రానా పేరును మాత్రం మిస్ కావటం పలువురి దృష్టికి వస్తోంది. అయితే.. ఇదంతా కావాలనేం కాదని.. కేవలం హడావుడి కారణంగా మాత్రమే జరిగిందన్న మాట వినిపిస్తోంది. పోలీసులు పది గంటల వరకే ఫంక్షన్ చేసుకోవటానికి అనుమతి ఇవ్వటం.. రాత్రి తొమ్మిదిన్నర నుంచే టైం అవుతుందన్న విషయాన్నివారు పదే పదేచెప్పటంతో.. ఈ ఫంక్షన్ ను హడావుడి.. హడావుడిగా ముగించాల్సి వచ్చిన వైనం స్పష్టంగానే కనిపించింది.ఈ కారణంతోనే రానా పేరును రాజమౌళి మిస్ అయి ఉంటారని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/