జక్కన్న ఇంటికి కొత్త బీఎండబ్ల్యూ

Mon Jun 19 2017 17:09:41 GMT+0530 (IST)

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి మూవీతో చారిత్రాత్మక విజయం సాధించేశాడు. బాహుబలి2తో భారీ మొత్తాన్నే తన ఖాతాలో వేసుకున్నాడని అంటారు. అయితే.. ఈ సినిమా ద్వారా రాజమౌళికి ఎంత మొత్తం దక్కిందనే విషయం చెప్పడం కష్టమే కానీ.. ఆయన గురించి వస్తున్న వార్తలు చూస్తే మాత్రం నిజమే అనిపించక మానదు.

హైద్రాబాద్ సమీపంలో 100 ఎకరాల లాండ్ రాజమౌళి కొన్నాడని.. అందులో ఓ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూములపై పెట్టుబడులు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ పై జక్కన్న భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాడని అంటున్నారు. వీటితో పాటు రాజమౌళి ఇప్పుడు ఓ కాస్ట్లీ కారు కూడా కొనుగోలు చేశాడు. తాజాగా జక్కన్న తన పర్సనల్ అవసరాల కోసం ఓ ఖరీదైన కారు సొంతం చేసుకున్నాడు.

లేటెస్ట్ మోడల్స్ లో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటిగా చెప్పే బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ ను కొనుగోలు చేశాడు జక్కన్న. హైద్రాబాద్ లో దీని ఎక్స్ షోరూం ధర కనీసం కోటి రూపాయలు ఉంటుంది. ఇప్పటికే జక్కన్న దగ్గర కాస్ట్లీ కార్స్ ఉన్నా.. అన్నిటిలోకీ ఇది మరీ ఖరీదెక్కువ అంటున్నారు సన్నిహితులు. మరోవైపు.. రాజమౌళి నెక్ట్స్ మూవీ ఏంటనే విషయంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/