Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఘాజీపై జక్కన్న ట్వీట్

By:  Tupaki Desk   |   19 Feb 2017 7:45 AM GMT
ఎట్టకేలకు ఘాజీపై జక్కన్న  ట్వీట్
X
దర్శకధీరుడు రాజమౌళి తన ట్వీట్స్ తో ఇచ్చే మినీ రివ్యూలకు చాలానే వాల్యూ ఉంటుంది. తెలుగు ఆడియన్స్ ఆ మూవీపై ఓ ఫీలింగ్ ఏర్పడేలా జక్కన్న ట్వీట్ రివ్యూలు ఉంటాయి. సహజంగా మంచి హైప్ ఉన్న సినిమాలు అన్నిటినీ రిలీజ్ రోజే చూసి ట్వీట్ చేసే జక్కన్న.. ఘాజీ విషయంలో ట్వీట్ పెట్టకపోవడం చర్చనీయాంశం అయింది.

ప్రస్తుతం తన సినిమా బాహుబలి2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న రాజమౌళి.. ఘాజీపై లేటుగా అయినా అదిరిపోయే ట్వీట్ పెట్టాడు. గత రాత్రి ఘాజీ మువీ చూసిన రాజమౌళి.. తన రియాక్షన్ తెలిపాడు. 'ఆన్ స్క్రీన్ పైనా.. ఆఫ్ స్క్రీన్ లోనూ.. కెప్టెన్ అండ్ క్రూ అదిరిపోయే పెర్ఫామెన్స్ చూపించారు. టీం ఘాజీ సూపర్బ్. కంగ్రాచ్యులేషన్స్ రానా' అంటూ ట్వీట్ పెట్టాడు రాజమౌళి.

కొత్త దర్శకుడు సంకల్ప్ తీసిన ఘాజీకి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్బ్ రియాక్షన్ వస్తోంది. రివ్యూలు రేటింగుల విషయంలో కూడా ఘాజీ డామినేషన్ చూపించింది. అంతే కాదు.. వసూళ్లు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయండే.. ఘాజీ సక్సెస్ రేంజ్ అర్ధమవుతుంది. ఇప్పుడు రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతం అంటూ ట్వీట్ చేయడం.. ఘాజీకి మరింత హెల్ప్ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/