`విజేత`పై జక్కన్న `ట్వీట్` ముందే కూసింది!

Thu Jul 12 2018 18:05:00 GMT+0530 (IST)

టాలీవుడ్ దర్శకులలో రాజమౌళికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపుగా పరాజయమెరుగని దర్శకుడిగా తన ట్రాక్ రికార్డును జక్కన్న కాపాడుకుంటున్నాడు. బాహుబలి తో ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు...టాలీవుడ్ లో విడుదలయ్యే పలు సినిమాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. సమయం దొరికితే....రిలీజ్ రోజే సినిమాను చూసి ....ఒక్క ట్వీట్ లో రివ్యూ చెప్పేయడం...జక్కన్నకు అలవాటు. రాజమౌళి ట్వీట్ రివ్యూ కోసం ఆయన అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే రొటీన్ కు భిన్నంగా నేడు విడుదలైన `విజేత`చిత్రంపై జక్కన్న నిన్నే ట్వీట్ చేశాడు. ఆ చిత్రానికి శుభాకాంక్షలు చెబుతూనే....రివ్యూకూడా ఇచ్చేశాడు.మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన `విజేత`పై రాజమౌళి ఆసక్తకరమైన ట్వీట్ కమ్ రివ్యూ చేశాడు. ఆ సినిమాపై తన అభిప్రాయం చెబుతూనే...చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ''తండ్రి కొడుకుల మధ్య అనుబంధంతో సాగే కథతో వారాహి చలన చిత్రం మీ ముందుకు వస్తోంది. పాటలు.. ట్రయిలర్ కొత్తగా ఉన్నాయి. `విజేత`టీం మొత్తానికి విజయం కలగాలని కోరుకుంటున్నాను'' అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. అయితే ఎప్పుడూ సినిమా చూసి రివ్యూ ఇచ్చే రాజమౌళి...ఈ సారి సినిమా విడుదలకు రివ్యూ ట్వీట్ చేయడం విశేషం. విడుదలకు ముందే విజయం సాధించాలని కోరుతూ తన రివ్యూ ఇవ్వడం విశేషం. అయితే `ఈగ` షూటింగ్ సమయం నుంచే వారాహి అధినేత సాయి కొర్రపాటితో జక్కన్నకు మంచి రిలేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుస్తు ట్వీట్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. ఏది ఏమైనా....జక్కన్న మార్క్ రివ్యూ&విషెస్ ట్వీట్...సోషల్ మీడియాలో వైరల్ అయింది!