బాహుబలి టీం సర్టిఫికేట్స్ ఇత్తన్నారంట

Fri Apr 21 2017 17:33:46 GMT+0530 (IST)

బాహుబలి విషయంలో ప్రతీ చిన్న ఇన్సిడెంట్ ను.. ఓ భారీ అప్ డేట్ ఇస్తున్న రేంజ్ లో హంగామా చేసి.. ఫ్రీ పబ్లిసిటీ సంపాదిండంలో రాజమౌళి విపరీతంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. టుస్సాడ్స్ మ్యూజియం ఇన్సిడెంట్.. వీఆర్ హెడ్ సెట్స్ మార్కెటింగ్.. వర్చువల్ రియాలిటీ ఎక్స్ పీరియన్స్.. బాహబలి కామిక్ సిరీస్.. ఇలా బాహుబలి2 చిత్రానికి సంబంధించని అనేక అంశాలను.. ప్రచారం కోసం భలే వాడేసుకున్నాడు జక్కన్న.

ఇప్పుడు రిలీజ్ మరో వారం రోజుల్లోనే ఉండడంతో.. ఇలాంటివి ఇంకా పెరిగిపోతున్నాయి. ఈసారి బాహుబలి టీంకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారట. బాహుబలి2 ఐమాక్స్ వెర్షన్ ను ప్రత్యేకంగా సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఐమ్యాక్స్ కాపీ రెడీ అయిపోయింది కూడా. దీని కోసం వర్క్ చేసిన వారికి.. సర్టిఫికేట్స్ చేతిలో పెడుతూ.. దాన్ని కూడా భలే ఉపయోగించుకుంటోంది బాహుబలి టీం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఇదీ ఓ పార్ట్. వాళ్లు చేసిన పని వీళ్లకు నచ్చింది. సర్టిఫికేట్స్ ప్రింట్ కొట్టించి ఇచ్చుకుంటున్నారు. దీనికి కవరేజ్ ఎందుకనే విషయం.. ఇట్టే అర్ధమైపోతుంది.

వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే అంచనాలున్న సినిమాకి..  మీడియా పబ్లిసిటీ కోసం ఖర్చు చేయకుండా.. ఇంత ప్రమోషన్ పొందడం.. బహుశా రాజమౌళి ఒక్కడికే సాధ్యం!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/