Begin typing your search above and press return to search.

ఐఐటీ ప్రొఫెస‌ర్‌ పాత్ర‌లో రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   13 Oct 2015 11:24 AM GMT
ఐఐటీ ప్రొఫెస‌ర్‌ పాత్ర‌లో రాజ‌మౌళి
X
బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి క్రేజ్ సౌత్ టు నార్త్ వ‌ర‌కు మార్మోగిపోతోంది. ఒకే ఒక్క సినిమా రాజ‌మౌళిని ఇండియ‌న్ స్టార్ చేసేసింది. రాజ‌మౌళి బాహుబ‌లి 2 సినిమా కోసం దేశంలోని చాలా మంది స్టూడెంట్స్‌తో పాటు యూత్ ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారంటే మ‌నోడు యువ‌త మ‌న‌స్సుల్లోకి ఎలా చొచ్చుకుపోయాడో అర్థ‌మ‌వుతోంది. ద‌ర్శ‌కుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు ఫెయిల్యూర్ లేకుండా ఉన్న జ‌క్క‌న్న ఇప్పుడు ఐఐటీ ప్రొఫెస‌ర్ అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. మ‌ద్రాస్ ఐఐటీ క‌ళాశాల విద్యార్థులకు రాజ‌మౌళి ఈ నెల 17న క్లాస్ తీసుకోబోతున్నాడు.

రాజ‌మౌళి గ‌తంలో బాహుబ‌లి మూవీ షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఈ సంవ‌త్స‌రం స్టార్టింగ్‌లో మ‌ద్రాస్ ఐఐటీని సంద‌ర్శించి వారితో ముచ్చ‌టించాడు. తాజాగా మ‌రోసారి ఐఐటీ క‌ల్చ‌ర‌ల్ డిపార్ట్‌ మెంట్ ఆహ్వానం మేర‌కు అక్క‌డ జ‌రిగే కార్య‌క్ర‌మంలో వారికి క్లాస్ తీసుకోనున్నాడు. ఈ క్లాస్‌ లో రాజ‌మౌళి బాహుబ‌లి సినిమా మేకింగ్‌ కు సంబంధించి ప‌లు అంశాల‌ను ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు వివ‌రించ‌నున్నాడు. అలాగే విద్యార్థులు అడిగే ప‌లు ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న స‌మాధానం ఇస్తారు.

బాహుబ‌లి సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించేసి వెళ్లిపోయినా ఆ సినిమాపై ప్ర‌జ‌ల్లో క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేదు. ఇప్పుడు ఇండియా మొత్తం బాహుబ‌లి 2 కోసం ఎదురు చూస్తోంది. కొద్ది రోజుల క్రితం త‌మిళ‌నాడులోని వెల్లూరు ఇంజ‌నీరింగ్ క‌ళాశాల కూడా ఇంజ‌నీరింగ్ విద్యార్థుల‌కు బాహుబ‌లి సినిమాపై 20 మార్కుల వ్యాస‌రూప ప్ర‌శ్న ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాలోని క్లైమాక్స్‌లో వ‌చ్చే వార్ ఎపిసోడ్‌ను మీరు ఎలా డిజైన్ చేస్తార‌న్న ప్ర‌శ్న విద్యార్థుల‌కు ఇచ్చారు. మ‌ద్రాస్ ఐఐటీ నుంచి ఈ అరుదైన ఆహ్వానం అందుకున్న రాజ‌మౌళికి భాష‌ల‌తో సంబంధం లేకుండా యూత్‌లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థ‌మ‌వుతోంది.