Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోకి రాజమౌళి థాంక్స్

By:  Tupaki Desk   |   24 Oct 2016 4:16 AM GMT
బాలీవుడ్ హీరోకి రాజమౌళి థాంక్స్
X
దర్శక ధీరుడు రాజమౌళి రేంజ్ మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అందరికీ ఆరాధ్యనీయుడిగా మారిపోయాడు. బాహుబలి మూవీలో ఒక ఫ్రేమ్ లో అయినా కనిపించే అవకాశం ఇమ్మని మహామహుల నుంచి కూడా రిక్వెస్టులు అందుకుంటున్న జక్కన్న.. ఓ బాలీవుడ్ హీరోకు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది.

అయితే ఇది ప్రొఫెషనల్ విషయంలో కాదు.. ఫ్యామిలీ రిలేషన్ లో భాగంగా కూతురు కోరికను తీర్చడం కోసం బాలీవుడ్ హీరోను ఓ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. బాలీవుడ్ హీరో సిద్ధార్ధ మల్హోత్రాకు రాజమౌళి కూతురు పెద్ద ఫ్యాన్. అతన్ని కలవాలనే కోరికను జక్కన్నకు చెప్పగా.. రీసెంట్ గా బాహుబలి2 ఫస్ట్ లుక్ లాంఛ్ కోసం ముంబై వెళ్లిన జక్కన్న అదే విషయాన్ని.. ఆ బాలీవుడ్ హీరోకు చెప్పి రిక్వెస్ట్ చేశాడు. మరి రాజమౌళి అంతటి దర్శకుడు ఓ చిన్న కోరిక కోరడం.. మరో సినిమా సెలబ్రిటీ చేయకుండా ఉండడం సాధ్యమవుతుందా? అడిగిన వెంటనే సరే అనేసి.. ఆమెను కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాడు.

'నా కూతురుని కలిసిందనుకు సిద్ధార్ధకు బోలెడన్ని థాంక్స్. తను చాలా చాలా ఎక్జైట్ అయింది. తనకు సిద్ధార్ధ ఇచ్చిన సలహాలకు థ్యాంక్స్. మా లైఫ్ ఇప్పుడు కొంచెం సింపుల్ గా అనిపిస్తోంది' అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని తెలియచెప్పాడు జక్కన్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/