Begin typing your search above and press return to search.

జక్కన్నకు అదిరిపోయే షాకిచ్చిన అభిమానులు

By:  Tupaki Desk   |   24 March 2017 4:47 PM GMT
జక్కన్నకు అదిరిపోయే షాకిచ్చిన అభిమానులు
X
బాహుబలి: ది కంక్లూజన్ టీజర్ సృష్టిస్తున్న రికార్డులకు ఇప్పుడు ఓ రూపం వచ్చింది. ఓ రౌండ్ ఫిగర్ ను అందుకుంది. ఈ నెల 16న రిలీజ్ అయిన మొదటి రోజునే 50 మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్స్ సృష్టించిన బాహుబలి2 ట్రైలర్.. ఇప్పుడు 100 మిలియన్ల వ్యూస్.. అక్షరాలా పది కోట్ల వ్యూస్ తో సెన్సేషనల్ రికార్డు సృష్టించింది.

తెలుగు.. తమిళం.. మలయాళం.. హిందీ టీజర్లు నాలుగు కలిపి 10 కోట్ల వ్యూస్ సాధించి.. దేశంలో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా బాహుబలి2 రికార్డు పుటల్లోకి ఎక్కేసింది. "100 మిలియన్లు.. ఎప్పుడూ ఈ సంఖ్యను కనీసం ఊహించుకోలేదు. ఇది సాద్యం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ కు 34 మిలియన్ల వ్యూస్ రాగా.. హిందీ వెర్షన్ ని కూడా ఇదే స్థాయిలో చూసారు. తమిళ ట్రైలర్ ను దాదాపు 6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక మలయాళ వెర్షన్ ను 11 మిలియన్ల మంది చూడగా.. మిగిలినవి ఇతర ప్లాట్ ఫాంస్ ద్వారా వచ్చాయి.

ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న బాహుబలి2 కోసం.. ఈ నెల 26న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు చెప్పిన రాజమౌళి.. దీని కోసం 360 డిగ్రీస్ లైవ్ వ్యూ కోసం.. ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/