Begin typing your search above and press return to search.

తన టీమ్ ను విడగొట్టిన రాజమౌళి

By:  Tupaki Desk   |   9 Dec 2017 9:59 AM GMT
తన టీమ్ ను విడగొట్టిన రాజమౌళి
X
దర్శకదీరుడు జక్కన్న ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు అంటే ముందుగానే ఒక స్ట్రాంగ్ టీమ్ అయన ఆలోచనలకు తగ్గట్టుగా ఉండాల్సిందే. ఒకవేళ కుదరకపోతే తనకు నచ్చేలా అందరిని మలుచుకోవడం జక్కన్నకి వెన్నతో పెట్టిన విద్య. ఎవ్వరినైనా తన ఆధీనంలోకి తెచ్చుకునే దర్శకదీరుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా అదే తరహాలో ఒక టీమ్ ను సెట్ చేసుకుంటున్నాడు .

అయితే ఆ టీమ్ ను మాత్రం రాజమౌళి రెండు భాగాలుగా విడగొట్టాడట. నెక్స్ట్ ఈ దర్శకుడు రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో ఒక భారీ మల్టి స్టారర్ సినిమాలను తెరకెక్కించబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథా చర్చలు కొనసాగిస్తున్న రాజమౌళి పనిలో పనిగా రెండు టీమ్స్ ను ముందే రెడీ చేసుకున్నాడు. ఒక టీమ్ మొత్తం రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ ని మరొక టీమ్ ఎన్టీఆర్ సీన్స్ ని టెస్ట్ షూట్ చేయనుందట. ఆ తర్వాత రెండు టీమ్ చేసిన సీన్స్ ను పరిశీలించి తాను ఒక క్లారిటీకి రానున్నాడట జక్కన్న.

ఉహలకందని సీన్స్ ఇందులో ఉన్నాయట.. సో ఒక్కోసారి వర్కౌట్ అవ్వచ్చు కాకపోవచ్చు అలాగే ఇద్దరు హీరోలు ఇమేజ్ కి తగ్గట్టుగా బ్యాలెన్స్ గా ఉందా లేదా అని తెలుసుకునేందుకు రాజమౌళి ఆ విధంగా ప్లాన్ చేశాడట. మల్టి స్టారర్ సినిమా చేయాలంటే పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఏ ఒక్క హీరోని తక్కువగా చూపించిన అభిమానులు హర్ట్ అవుతారనే టెన్షన్ చాలా ఉంటుంది. మరి రాజమౌళి ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.