Begin typing your search above and press return to search.

పెద్ద ఆఫీస్ వెతుక్కున్న జక్కన్న

By:  Tupaki Desk   |   8 Feb 2016 11:30 AM GMT
పెద్ద ఆఫీస్ వెతుక్కున్న జక్కన్న
X
బాహుబలి సక్సెస్ తర్వాత రాజమౌళి రేంజ్ బాగా మారిపోయిందన్న మాట వాస్తవం. జక్కన్నకు చాలా భాషల నుంచే ఆఫర్స్ వస్తున్నా.. ప్రధానంగా బాలీవుడ్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. గతంలో జక్కన్న తీసిన పలు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి కూడా. ఇప్పుడు తను కూడా ముంబైలో సెటిల్ అయ్యేందుకు.. అక్కడ పాగా వేసేందుకు ఓ పెద్ద ఆఫీస్ ని కూడా సెటప్ చేసే పనిలో పడ్డాడు జక్కన్న.

బాలీవుడ్ వెళ్లే విషయంలో తుది నిర్ణయం మాత్రం బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ అయిన తర్వాతే తీసుకుంటానని పైకి చెబుతున్నా ఇప్పటికే ఆఫీస్ వెతుక్కునే పనిలో ఉన్నారు కొంతమంది టీం. రాజమౌళి టేస్ట్ అనుగుణంగా ఉండేలా.. ఎక్కువ స్పేస్ తో ఓ భారీ ఆఫీస్ నిర్మాణం కూడా చేయాలన్నది ఆలోచన. ప్రస్తుతం రాజమౌళితో మంచి క్లోజ్ గా ఉంటున్న కరణ్ జోహార్.. ఓ భారీ ఆఫీస్ స్పేస్ చూపించాడట. ముంబైలో అత్యంత కాస్ట్ లీ ఏరియా బాంద్రాలోని ఓ కాంప్లెక్స్ లో 14వ అంతస్తులో రాజమౌళి ఆఫీస్ సెటప్ ఉండనుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఉన్నపుడు చిన్న ఆఫీస్ తోనే సరిపెట్టేసిన జక్కన్న.. బాలీవుడ్ లో మాత్రం మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రారంభం నుంచే తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు.

బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి తన కార్యకలాపాలను ముంబై ఆఫీస్ నుంచే నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి రాజమౌళి హిందీ రంగ ప్రవేశం ఫిక్స్ అయినట్లే. ఇదిలా ఉంటే 2017 ప్రారంభంలోనే బాహుబలి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ కానుంది.