శాతకర్ణికి రాజమౌళి స్టాంప్

Thu Jan 12 2017 09:20:21 GMT+0530 (IST)


పెద్ద సినిమా విడుదలైన రోజునే మిస్ అవ్వకుండా చూసి దానిమీద తనమార్కు రివ్యూ ఇచ్చేస్తాడు దర్శక ధీరుడు రాజమౌళి. నిన్న ఖైదీ నెంబర్ 150 కి సగటు ప్రేక్షకుడి రెస్పాన్స్ ఇచ్చిన జక్కన్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోకి గౌతమీపుత్ర శాతకర్ణి చూసి రివ్యూ ఇచ్చేశాడు.

సాహో బసవతారక పుత్ర బాలకృష్ణ. శాతకర్ణి పాత్ర పోషించినందుకు సెల్యూట్. రామారావుగారు గర్విస్తారు.  ఇటువంటి అనితరసాధ్యమైన అనుభూతిని కేవలం 79రోజుల్లో చిత్రీకరించిన క్రిష్ నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నా. 12కోట్ల తెలుగు ప్రజల దీవెనెలు నీకెప్పుడూ వుంటాయి. సాయిమాధవ్ గారూ మీ కలం శాతకర్ణి ఖడ్గంతో సమానం. కెమెరా పనితనం నిర్మాణ విలువలు అద్భుతం. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుందని ట్వీట్ల వర్షం కురిపించాడు.

ఒక పీరియాడిక్ మూవీకి రాజమౌళినుండి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే సినిమాకి సూపర్ హిట్ ఛాయలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. నిన్న అంజనీపుత్రుడు రఫ్ఫాడిస్తే నేడు అంజనా పుత్రుడివంతన్నమ్మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/