ఆర్ ఆర్ ఆర్ ఫ్లాష్ బ్యాక్ లో బాలీవుడ్ స్టార్

Thu Mar 14 2019 13:43:46 GMT+0530 (IST)

ఇందాకా జరిగిన ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ మోసుకొచ్చిన విశేషాలతోనే ఈ రోజు చరణ్ తారక్ ఫ్యాన్స్ కు రోజు గడిచిపోయేలా ఉంది. కీలకమైన అంశాల గురించి రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ దానయ్య మాట్లాడారు కాబట్టి గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న గాసిప్స్ కి చెక్ పడినట్టే. అజయ్ దేవగన్ ఇందులో ఓ పాత్ర చేయబోతున్నాడనే వార్త గతంలోనే వచ్చింది. దాన్ని రాజమౌళి ధృవీకరించాడు.ఇందులో అజయ్ దేవగన్ నటిస్తున్నారని అయితే అది విలన్ పాత్ర కాదని చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందని చెప్పారు. అయితే అజయ్ దేవగన్ కాంబోలో ఈ ఇద్దరు హీరోల సీన్లు ఉంటాయా లేదా అనే సీక్రెట్ మాత్రం బయటికి చెప్పలేదు. రాజమౌళి మాటలను బట్టి చూస్తే అజయ్ దేవగన్ సినిమా మొత్తం ఉండరని మాత్రం అర్థమైపోయింది

ఇక తమిళ నటుడు కం దర్శకుడు సముతిర ఖనిని మరోసారి రాజమౌళి కన్ఫర్మ్ చేసాడు. అది చెర్రి మామయ్య పాత్ర అని ఇంతకు ముందే లీక్ద్ న్యూస్ ఉంది. దాని తాలుకు తీరుతెన్నుల గురించి జక్కన్న ఓపెన్ కాలేదు. ఈ ఇద్దరి గురించి తప్ప ఇంకే కీలక పాత్రధారుల గురించి రాజమౌళి బయటపెట్టలేదు. హీరో హీరొయిన్లతో పాటు ఈ ఇద్దరి గురించి మాత్రమే ప్రెస్ మీట్ లో రివీల్ చేసాడు.

దీన్ని బట్టి ఇంకొందరి సెలక్షన్ జరగాల్సి ఉందనే పాయింట్ అర్థమవుతోంది. అజయ్ దేవగన్ తోడయ్యాడు కాబట్టి బాలీవుడ్ మార్కెట్ పరంగా ఇంకొంత బలం వస్తుంది. మాములుగానే రాజమౌళి అంటేనే అక్కడ ఒక బ్రాండ్. ఇప్పుడు అజయ్ దేవగన్ అలియా భట్ లాంటి వాళ్ళు జత కడితే హైప్ కు అడ్డుకట్ట వేయడం కష్టమే