Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ట్రైలర్ రెడీనే.. కానీ

By:  Tupaki Desk   |   25 Feb 2017 7:50 AM GMT
బాహుబలి-2 ట్రైలర్ రెడీనే.. కానీ
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకో రెండు నెలలే సమయముంది. ఇప్పటిదాకా కొన్ని పోస్టర్లు మాత్రమే వదిలారు తప్ప.. ఇంకే విశేషాలూ బయబటికి రాలేదు. ‘ది బిగినింగ్’ ట్రైలర్ ను చాలా ముందుగానే లాంచ్ చేశారు. అది సినిమా మీద అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ‘ది కంక్లూజన్’ ట్రైలర్ ఎలా ఉంటుందో.. అది సినిమాపై ఇప్పటికే ఉన్న భారీ అంచనాల్ని ఇంకెంత పెంచేస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘బాహుబలి-2’ ట్రైలర్ ఎప్పుడొస్తుందన్న క్లారిటీ కూడా లేదు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో ట్రైలర్ ఊసెత్తాడు రాజమౌళి.

‘‘బాహుబలి-2 ట్రైలర్ రెడీ అయింది. మా వరకు షాట్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాం. ఇక దానికి విజువల్ ఎఫెక్ట్స్.. సీజీ హంగులు జోడించాల్సి ఉంది. ట్రైలర్ ఎప్పుడొస్తుందో కరెక్ట్ డేట్ చెప్పడంలో మాకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మేం ఇప్పుడు డేట్ ప్రకటించామంటే వీఎఫెక్స్ స్టూడియో వాళ్లు సరిగ్గా ఆ తేదీకే కంటెంట్ ఇస్తారు. కొంచెం రిలాక్స్ అవుతారు. మాకు ఇబ్బందవుతుంది. ఆ కంటెంట్ మా చేతికి వచ్చాక వాటిని మిక్స్ చేయడం.. ట్రైలర్ సరిగ్గా వచ్చేలా చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ముందే డేట్ చెప్పేసి.. వీఎఫెక్స్ కంటెంట్ వచ్చాక దాన్ని మిక్స్ చేయడంలో ఆలస్యమై.. చెప్పిన సమయానికి ట్రైలర్ రాకుంటే జనాలు గోల పెట్టేస్తారు. అందుకే డేట్ చెప్పట్లేదు. ఆ కంటెంట్ కోసం వాళ్లను తొందరపెడుతున్నాం. వాళ్లు అదివ్వగానే అన్నీ చూసుకుని డేట్ ప్రకటించి.. ట్రైలర్ లాంచ్ చేస్తాం. ఏదేమైనా మార్చి మధ్యలో ట్రైలర్ రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్’’ అని రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/