Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న‌కు అర‌వింద్ తో వ‌చ్చిన తేడా అదేన‌ట‌

By:  Tupaki Desk   |   29 May 2017 5:24 AM GMT
జ‌క్క‌న్న‌కు అర‌వింద్ తో వ‌చ్చిన తేడా అదేన‌ట‌
X
మిగిలిన రంగాల‌తో పోలిస్తే.. సినిమా ఇండ‌స్ట్రీ కాస్త భిన్నం. లోప‌ల ఎన్ని ఉన్నా.. బ‌య‌ట‌కు మాత్రం న‌వ్వుతూ మాట్లాడుతుంటారు. గుండెల్లో ఉండే కోప‌తాపాల్ని అస్స‌లు బ‌య‌ట‌పెట్ట‌రు. ఒక‌వేళ ఎవ‌రైనా అడిగినా.. దానికి రియాక్ట్ కారు. ఇక‌.. ప్ర‌ముఖుల విష‌యానికి వ‌స్తే.. ఇలాంటివి మ‌రింత గోప్యంగా ఉంటాయి.

న‌లుగురి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తుంటాయే కానీ.. దాని మీద మీడియా ముఖంగా మాట్లాడ‌టం చాలా చాలా అరుదు. కానీ.. అందుకు భిన్నంగా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా.. మ‌న‌సు విప్పేశారు బాహుబ‌లి ద‌ర్శ‌కులు జ‌క్క‌న్న అలియాస్ రాజ‌మౌళి. మ‌గ‌ధీర మూవీ విష‌యంలో అల్లు అర‌వింద్‌ కు.. రాజ‌మౌళికి మ‌ధ్య లెక్క తేడా వ‌చ్చింద‌ని.. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింద‌న్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌. అదే విష‌యాన్ని ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావించిన‌ప్పుడు ఓపెన్ అయిపోయారు రాజ‌మౌళి.

స‌ద‌రు ఇంట‌ర్వ్యూలో జ‌క్క‌న్న చెప్పింది య‌థాత‌ధంగా చూస్తే.. "మ‌గ‌ధీర టైంలో 100 డేస్ అని థియేట‌ర్ల సంఖ్య పెంచి వేసేవారు. అంద‌రూ చేసేవారు. అది చాలా ఇబ్బందిగా.. చిరాకుగా అనిపించేది. అల్లు అర‌వింద్ తో సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు ఇదే విష‌యాన్ని చ‌ర్చించా. మనం ఆపేద్దాం సార్ అంటే.. ఓకే.. డ‌న్ అన్నారు. మ‌గ‌ధీన ఎంత హిట్టు అయ్యిందో అంద‌రికి తెలిసిందే. ఇలాంటి వేళ‌.. ఇన్ని థియేట‌ర్ల‌లో 100 డేస్ అని వేశారు. నేనెళ్లి మ‌నం అపేద్దామ‌ని అనుకున్నాం క‌దా సార్ అన్నా. నాకు ఉంది రాజ‌మౌళి.. కానీ ఫ్యాన్స్ తో చాలా ఇబ్బంది ఉంది. నీకు తెలీదు మాకుండే డెలికేట్ ఇష్యూస్ అన్నారు. ఆయ‌న చెప్పింది నేను అర్థం చేసుకున్నా. అయినా మ‌నం ఆపేద్దామ‌ని అనుకున్నాం క‌దా.. మాటంటే మాటే క‌దా అన్నా. వంద రోజుల ఫంక్ష‌న్ కు రాలేన‌ని చెప్పేశా. గొడ‌వేం లేదు కానీ నా ప‌రిస్థితి ఆయ‌న అర్థం చేసుకున్నారు. ఆయ‌న ప‌రిస్థితిని నేను అర్థం చేసుకున్నాను" అని అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/