Begin typing your search above and press return to search.

జక్కన్న టెకీ కాదు.. అంతకు మించి

By:  Tupaki Desk   |   28 Nov 2015 9:00 AM GMT
జక్కన్న టెకీ కాదు.. అంతకు మించి
X
ప్రశంసలకు, పొగడ్తలకు పడిపోనివాళ్లు ఉండరు. అవార్డులంటే అభిమానం లేని వాళ్లు అసలుండరు. ఇది అన్ని చోట్లా ఉన్నా.. సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. ముఖ్యంగా తమకొచ్చిన అవార్డులను శాశ్వతంగా దాచుకుంటూ, చూసుకుంటూ మురిసిపోతుంటారు చాలామంది. తాము పడ్డ కష్టానికి గుర్తింపు లభించడం ఎవరికైనా ఆనందమే. కానీ దర్శకధీరుడు రాజమౌళి మాత్రం తన దృష్టిలో అసలు అవార్డులంటే విలువ లేనివి అంటున్నాడు.

ప్రస్తుతం జక్కన్న తీసిన బాహుబలి.. ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ఏ అవార్డల్లో 14 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఇంతగా ఏ సినిమాకి అయినా నామినేషన్స్ దక్కాయంటే.. అది ఖచ్చితంగా ఆ సినిమా గొప్పదనమే. ఇంతటి ఖ్యాతి పొందడంతో.. ఖచ్చితంగా ఆ దర్శకుడు గొప్పగా ఫీలవుతూ ఉంటాడని అనుకుంటాం. కానీ రాజమౌళి మాత్రం అసలు దీనికి ఇంపార్టెన్స్ లేదుంటున్నాడు. కాకపోతే తన సినిమాల్లో పనిచేసిన టెక్నీషియన్స్ కి అవార్డులు వస్తే మాత్రం సంతోషిస్తానని చెప్పాడు రాజమౌళి. ఇవి వాళ్లలో స్ఫూర్తి నింపుతాయని కూడా చెప్పాడు. ఇతరులకు స్ఫూర్తినివ్వడం గురించి బాగానే చెప్పాడు కానీ.. మరి అవే అవార్డులు ఆయనకెందుకు స్ఫూర్తిని కలిగించవో అర్ధం కాని వి
షయం.

సాధారణంగా డైరెక్టర్ అంటే.. టెక్నీషియనే. కాకపోతే అందరికీ ఆయన కెప్టెన్. మరి తనకు మాత్రం అవార్డులంటే విలువ లేనివి అంటున్నాడంటే.. వాటిపై విరక్తి అయినా వచ్చుండాలి. లేకపోతే.. తాను సాధారణ టెక్నీషియన్ ని కాదు.. అంతకు మించి అని ఫీలవుతూ అన్నా ఉండాలి. రెండింటిలో ఏది నిజమో మనం చెప్పడం సాధ్యం కాదు కానీ.. ఇండస్ట్రీ జనాలు మొత్తం తమకు గుర్తింపునిచ్చేవిగా భావించే అవార్డులను, విలువ లేనివిగా చెప్పడంతో చాలామంది హర్టయ్యారని తెలుస్తోంది.