జక్కన్న చూపు.. ఎవరివైపు?

Fri May 19 2017 23:00:01 GMT+0530 (IST)

నిన్నటివరకు రాజమౌళి ఓటమి ఎరుగని దర్శక ధీరుడు - బాహుబలి సినిమాతో జక్కన్న రేంజ్ మారిపోయింది. క్రేజ్ పెరిగిపోయింది. ఆయన అడిగితే డబ్బులు కుమ్మరించేందుకు నిర్మాతలు.. వరస డేట్లు ఇచ్చేందుకు హీరోలు క్యూలో ఉంటారు. బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయిపోయాడు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేశాక హీరో రేంజి అమాంతం పెరిగిపోతుందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే తర్వాత సినిమా తమతో చేయాలంటూ రాజమౌళికి ఆబ్లిగేషన్లు కాస్త ఎక్కువగానే వస్తున్నాయి. తర్వాత ఏ సినిమా చేయాలి ఎవరితో సినిమా చేయాలనేది రాజమౌళి ఇంతవరకు డిసైడవకపోవడంతో ఆయనను ఒప్పించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

రాజమౌళి నెక్ట్స్ ఫిలిం నిర్మాత డి.వి.వి.దానయ్య అనేది దాదాపుగా డిసైడైపోయింది. అందుకే హీరోలు - వారి కుటుంబ సభ్యులు అటు నుంచి పని పూర్తి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాజమౌళితో సినిమా తీయాలని అల్లు అరవింద్ అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం దానయ్యతో సంప్రదింపులు చేస్తున్నారనేది పిలిం నగర్ వర్గాల మాట. మరోవైపు నాగార్జున సైతం తన రెండో కుమారుడు అఖిల్ ను హీరోగా నిలబెట్టేందుకు బంపర్ హిట్ అవసరం. ఇందుకోసం రాజమౌళియే కరెక్ట్ ఛాయిస్ అని ఫీలవుతున్నాడట. ఈ మేరకు ఆయన సైతం తన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు జక్కన్న ఓ డిసిషన్ కు రాలేదని టాక్.

బాహుబలి తర్వాత ఈగ సీక్వెల్ తీయాలని రాజమౌళి అనుకున్నప్పటికీ దానికి బోలెండత గ్రాఫిక్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి సినిమా కోసం అత్యధిక సమయం గ్రాఫిక్ కోసమే వెచ్చించినందున గ్రాఫిక్స్ అవసరం లేకుండా తర్వాత సినిమా పూర్తి చేయాలని డిసైడయ్యాడు రాజమౌళి. దాంతో ప్రస్తుతానికి ఈగ-2 ఆలోచనను పక్కన పెట్టేశాడు.  ఐదేళ్ల పాటు బాహుబలి కోసం శ్రమించిన జక్కన్న మూడు నెలలు విరామం ప్రకటించాడు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఆయన మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ వస్తాడు. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఆలోగా తన నెక్స్స్ ప్రాెజెక్ట్ వివరాలు అనౌన్స్ చేస్తారట. లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/