Begin typing your search above and press return to search.

కుక్క తోక వంక‌ర తీసేదెపుడు?

By:  Tupaki Desk   |   14 March 2019 5:30 PM GMT
కుక్క తోక వంక‌ర తీసేదెపుడు?
X
భారీ గ్రాఫిక్స్ తో ప‌ని చేయ‌డం అంటే ఆషామాషీ కాదు. ఏళ్ల త‌ర‌బ‌డి ఉలి వేసి చెక్కాలి. ఈ విష‌యంలో అనుభ‌వం ఎంతో ఘ‌డించిన రాజ‌మౌళి అందులో ఉన్న క‌ష్టానికి ఎంతో విసిగిపోయి ఉన్నారు. బాహుబ‌లి సిరీస్ కోసం ఏకంగా ఐదేళ్ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది అంటే అందులో ఉన్న శ్ర‌మ ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఈగ‌ - బాహుబ‌లి 1 - 2 కోసం ఆయ‌న అహోరాత్రులు శ్ర‌మించారు. అందుకే ప్ర‌తిసారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా తీయ‌ను అని చెబుతుంటారు. అంత క‌ష్టం ఎవ‌రు ప‌డ‌తారు? అని సెల‌విస్తుంటారు. అయితే ఆయ‌న `కుక్క తోక వంక‌ర‌` టైపు. అన్న‌ది ఎప్పుడూ చేయ‌రు. తిరిగి మ‌ళ్లీ గ్రాఫిక్స్ లేనిదే బ‌త‌క‌లేరు. ఈ విష‌యంలో రాజ‌మౌళి త‌న‌పై తానే సెటైర్ వేసుకోవ‌డం మీడియాలో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే ఆర్.ఆర్.ఆర్ గ్రాఫిక్స్ ఎందుకు ఉప‌యోగిస్తున్నారు? దానికోసం ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అన్న ప్ర‌శ్న విన‌ప‌డ‌గానే రాజ‌మౌళి త‌న‌కు తాను గానే `కుక్క తోక వంక‌ర‌` అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ ని కేవ‌లం స‌హ‌జ‌త్వం కోసం ఉప‌యోగిస్తున్నామ‌ని తెలిపారు. 1920 నాటి వాతావ‌ర‌ణాన్ని య‌థాత‌థంగా చూపించాలంటే విజువ‌ల్ గ్రాఫిక్స్ ప్రాధాన్య‌త ఎంతో ఉంటుంద‌ని అన్నారు. గ్రాఫిక్స్ కోసమే తమ ప‌ని దినాల్ని త‌గ్గించామ‌ని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి గ్రాఫిక్ టీమ్ కు అన్నీ అందిస్తాం. అక్కడ్నుంచి నెల రోజుల పాటు వాళ్లు గ్రాఫిక్ వర్క్ మీద ఉంటామ‌ని అన్నారు. త‌దుప‌రి షెడ్యూల్ ను అహ్మదాబాద్ - పూణెలో ప్లాన్ చేశారు. ఏకథాటిగా 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. అజయ్ దేవగన్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడ‌ని వెల్లడించారు.

విజువ‌ల్ గ్రాఫిక్స్ అంటే అల్లూరి సీతారామ రాజు న‌డ‌యాడిన అడ‌వి ప్రాంతాన్ని విజువ‌ల్ గ్రాఫిక్స్ లో చూపించాల్సి ఉంటుంది. గిరిజ‌న గూడెం వాతావ‌ర‌ణాన్ని చూపాలి. ఆయ‌న ఏపీ న‌ర్సీప‌ట్నం లో కేడీపేట ప‌రిస‌రాల్లో న‌డియాడార‌ని చెబుతారు. అలాగే కొమురం భీమ్ తెలంగాణ ప్రాంతంలోని గిరిజ‌న తండాల‌తో అనుబంధం క‌లిగిన గిరిజ‌న వీరుడిగా చెబుతారు. అందుకే వీరి నేప‌ద్యం ప‌చ్చ ద‌నం మ‌ధ్య‌నే ఉంటుంది. కాబ‌ట్టి ఆ వాతావ‌ర‌ణాన్ని, వీర‌త్వాన్ని పోరాటాల్ని వీఎఫ్ ఎక్స్ లోనే చూపించాల్సి ఉంటుంది.