Begin typing your search above and press return to search.

ఇప్పటికైనా రెస్పాన్స్‌ చెప్పు రాజమౌళి

By:  Tupaki Desk   |   30 July 2015 10:59 PM GMT
ఇప్పటికైనా రెస్పాన్స్‌ చెప్పు రాజమౌళి
X
బాహుబలి 500కోట్ల వసూళ్ల క్లబ్‌ లోకి చేరబోతోంది. కేవలం 22రోజుల్లో సాధించిన అసాధారణ ఫీట్‌ ఇది. అయితే ఇలాంటి సందర్భంలో కూడా ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి సక్సెస్‌ గురించి మాట్లాడకుండా మౌనమునిలా యోగముద్రలో మునిగిపోతున్నాడు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. తన పని తాను చేసుకుపోతున్నాడే తప్ప ఇంతటి విజయం సాధించాం, అంతటి విజయం సాధించామని గొప్పలు చెప్పుకునే పనికి పోలేదు.

హార్డ్‌ వర్క్‌ చేశాం. ఫలితం అందుకున్నాం అన్న ఎక్స్‌ ప్రెషన్‌ తప్ప మీడియా ముందుకు వచ్చినా అతడు ఏదీ మాట్లాడడమే లేదు. ఈరోజు ఉదయం ఆట హైదరాబాద్‌ బ్రమరాంభ థియేటర్‌ లో వీక్షించిన రాజమౌళి అండ్‌ ఫ్యామిలీ సక్సెస్‌ గురించి మాట్లాడుతుందేమోనని మీడియా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ రాజమౌళి చాలా సింపుల్‌ గా ఏమీ ఎరుగనట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గొప్పలు చెప్పుకునే అవసరం, ఆసక్తి రెండూ అతడిలో కనిపించలేదు ఆ క్షణంలో. చాలా హుందాగా మాట్లాడడానికి ఏం ఉంటుంది? అంటూ అక్కడినుంచి నిష్క్రమించాడు.

అయితే బాహుబలి చిత్రంపై రకరకాల విమర్శలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ అయినా ఇప్పటికైనా మాట్లాడతాడేమోనని అనుకున్న వారికి ఈసారి కూడా నిరాశే ఎదురైంది. అవంతిక పాత్ర చిత్రణను మహిళామణులు విమర్శించారు. దానిని ఖండిస్తాడని అనుకున్నవారికి నిరాశే ఎదురైంది. ఇప్పటికైనా రాజమౌళి మీడియా ముందు మాట్లాడితే బావుంటుంది. మౌనం వీడితేనే బావుండేదేమో!