Begin typing your search above and press return to search.

బ‌న్ని హీరోగా రాజ‌మౌళి సినిమా?

By:  Tupaki Desk   |   12 Oct 2015 5:30 AM GMT
బ‌న్ని హీరోగా రాజ‌మౌళి సినిమా?
X
టాలీవుడ్ ఒక‌ప్పుడు వేరు. ఇప్పుడు వేరు. బాహుబ‌లి త‌ర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఇక్క‌డ భారీ మ‌ల్టీస్టారర్ల‌కు స్కోప్ పెరిగింది. మ‌న మార్కెట్ జాతీయ - అంత‌ర్జాతీయ స్థాయికి విస్త‌రించింది. జ‌క్క‌న్న అలియాస్ రాజ‌మౌళి ఒంటి చేత్తో వెయ్యి కోట్ల ల‌క్ష్యాన్ని ట‌చ్ చేస్తున్నాడు. అలాంట‌ప్పుడు టాలీవుడ్ లో మునుముందు ఈక్వేషన్లన్నీ మారిపోతున్నాయి. ఇక్క‌డ ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంది.

మ‌న హీరోల్లో అల్టిమేట్ ట్యాలెంట్ ఉంది. ఎన‌ర్జీ రాశులుగా పోగుప‌డి ఉంది. మ‌న‌కి పెట్టుబ‌డులు పెట్టే కార్పొరెట్ అందుబాటులో ఉంది. ఈరోస్‌ - రిల‌య‌న్స్‌ - ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వంటి సంస్థ‌ల‌తో మన ప్రొడ్యూసర్ లు అల్లు అర‌వింద్‌ - డి.సురేష్‌ బాబు - సాయి కొర్ర‌పాటి - దిల్‌ రాజు వంటి దిగ్గ‌జాలు రంగంలోకి దిగి పూనుకుంటే టాలీవుడ్‌ కి ఓ ప్రిడేట‌ర్ - ఐ రోబో లాంటి సినిమా క‌ష్ట‌మేమీ కాదు. అందునా మ‌గ‌ధీర‌ - ఈగ‌ - బాహుబ‌లి లాంటి సినిమాల‌తో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిన జ‌క్క‌న్న అలా ముంద‌డుగు వేసేందుకే ప్లాన్ వేస్తున్నాడు. కాబ‌ట్టి ఇదే స‌రైన టైమ్‌.

ఇక అల్లు అర్జున్‌ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కాల్సిన టైమ్ వ‌చ్చేసింది. బ‌న్నిలోని ఎన‌ర్జీ ఓ టాప్‌ హాలీవుడ్‌ స్టార్‌ కి త‌క్కువ అని ఎవ‌రినైనా చెప్ప‌మ‌నండి. అందుకే ఇప్పుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని హీరోగా అల్లు అర‌వింద్ నిర్మించే సినిమాకి స‌న్నాహాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా స్ట‌యిలిష్ స్టార్ బ‌న్నితో ఓ కత్తిలాంటి హిస్టారికల్‌ సినిమా తీయ‌గ‌లం త‌లుచుకుంటే. మొన్న రిలీజ్‌ అయిన గోన గన్నారెడ్డి రోల్‌ అది ప్రూవ్‌ చేసేసింది.

బ‌న్ని రుద్ర‌మ‌దేవి 3డి చిత్రంలో గోన‌గ‌న్నారెడ్డిగా అద‌ర‌గొట్టేశాడు. తెలంగాణ యాక్సెంట్‌ తో బ‌న్ని టైమింగ్ అదిరిపోయింది. బ‌న్నిలోని వెర్స‌టైలిటీ జ‌క్క‌న్న క‌ల‌యిక‌లోని సినిమాకి పెద్ద ప్ల‌స్ అవుతుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ ను పట్టుకొని అల్లు అరవింద్‌ బాహుబలి 2 పూర్తవ్వగానే తన కొడుకుతో సినిమా చేయాలని జక్కన్నను కోరుతున్నారట.