Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కంపెనీతో రాజమౌళి డీల్

By:  Tupaki Desk   |   16 March 2018 12:30 PM GMT
బాలీవుడ్ కంపెనీతో రాజమౌళి డీల్
X
ఎంత పెద్ద సినిమా అయినా ఈ మధ్య హిట్ అవ్వాలి అంటే ప్రమోషన్లు ఒక రేంజిలో ఉండాల్సివస్తోంది. కథ - యాక్టింగ్ - టేకింగ్ - దర్శకత్వం - పాటలు ఇవన్నీ పక్కన పెడితే సినిమా ట్రైలర్ - టీజర్ - పోస్టర్ నచ్చి సినిమాకు వెళ్లే జనాలు ఉన్నారు. మాములు చిన్న సినిమా వాళ్లే ప్రోమోషన్స్ పేరు చెప్పి హంగామా చేసేస్తుంటే మరి మన రాజమౌళి సినిమా ప్రమోషన్లు అంటే ఎలా ఉండాలి చెప్పండి.

అసలు సినిమా ఏమి తీశారని ప్రమోషన్లు మాట వస్తోంది అని అనుకుంటున్నారా? నిజానికి బాహుబలి ప్రోమోషన్స్ అప్పుడు జక్కన్న ఒక బాలీవుడ్ కంపెనీతో టై అప్ అయ్యారు. మార్చింగ్ యాంట్స్ అనే ఒక ముంబై కి సంబంధించిన కంపెనీ అది. ఆ సినిమా అపుడే మరొక సినిమా కోసం కూడా డీల్ రాశారు అని సమాచారం. అందుకే ఇప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించబోతున్న మల్టిస్టారర్ ప్రమోషన్లు కూడా ఈ కంపెనీనే చూసుకోబోతోంది. వీళ్ళే రామ్ చరణ్ ను మరియు ఎన్టీఆర్ ని లాస్ ఏంజెల్స్ కు తీసుకువెళ్లి ఫోటోషూట్ కూడా చేశారట.

అంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టేముందే ప్రోమోషన్ల పని మొదలు పెట్టేసాడు అన్నమాట మన జక్కన్న. ఇద్దరు హీరోయిన్లను కూడా త్వరలో సెలెక్ట్ చేసి త్వరలో పోస్టర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలు ఎంటో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.