Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ ఫ్యామిలీ క్రియేషన్లేగా...

By:  Tupaki Desk   |   28 Aug 2015 11:13 PM GMT
ఫ్యామిలీ ఫ్యామిలీ క్రియేషన్లేగా...
X
ఎక్కడైనా ఓ ఫ్యామిలీలో ఒక క్రియేటర్ ఉంటాడు. కానీ మన జక్కన్న కుటుంబంలో మాత్రం అందరూ మహా మేధావుల్లానే ఉన్నారు. ముందుగా పెద్దాయన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో మొదలుపెడదాం. సల్మాన్ లాంటి కమర్షియల్ మాస్ హీరోకి... భజరంగీ లాంటి స్టోరీ ఎవరైనా చెప్పే సాహసం చేస్తారా? బాహుబలి ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయిందంటే... ఇంతటి సినిమా తీయచ్చనే నమ్మకం ఇచ్చే కథ దొరకాలి కదా. మరి ఈయన పెద్ద క్రియేటరే కదా.

ఆ తర్వాత రాజమౌళి. మొదటి మూవీ నుంచి ఇప్పటివరకూ ఫ్లాప్ అనే మాట కూడా తెలీకుండా చేస్తున్న ప్రయాణం జక్కన్నది. రికార్డులు సృష్టించడం, వాటిని ఆయనే బద్దలు కొట్టేసుకుని తిరిగి రాసుకోవడం... బాగా అలవాటయింది రాజమౌళి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రియేషన్ కి కొత్త అర్ధం ఏంటి అంటే రాజమౌళి అనాలన్నమాట.

ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జక్కన్న భార్య రమారాజమౌళి గురించే. భర్త తీసే సినిమాలకు కాస్ట్యూమ్స్, స్టైలింగ్ చూసుకుంటారీమె. ఈమె ఎంతటి ప్రతిభావంతురాలో... బాహుబలిలో ఒక్కో పాత్రకీ ఒక్కో రకంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇన్ని వందల రకాల డిజైనింగ్ అంటే... ఎంతటి బ్రెయిన్ ఉండాలో ఆలోచించండి.

ఇక రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ. షోయింగ్ బిజినెస్ పేరుతో కార్తికేయ ఓ పబ్లిసిటీ కంపెనీ నిర్వహిస్తున్నాడు, క్రియేటివిటీతో పబ్లిసిటీ చేయడం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఒక్క పోస్టర్ తో అఖిల్ ఎంత సెన్సేషన్ సృష్టిస్తోందో చూస్తున్నాం. దీనికి ముందు బాహుబలి ప్రమోషన్ లోనూ కూడా కార్తికేయ క్రియేషనే కీలక పాత్ర పోషించింది. మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా క్రియేటర్లే ఉన్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనే సామెతను... వీళ్లు తిరగరాసేస్తున్నారు కదూ.