Begin typing your search above and press return to search.

#RRR: రాజమౌళి ప్రధాని.. దానయ్య రాష్ట్రపతి!

By:  Tupaki Desk   |   24 Jan 2019 7:41 AM GMT
#RRR: రాజమౌళి ప్రధాని.. దానయ్య రాష్ట్రపతి!
X
ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే అంతే. క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. సినిమా మొదలు పెట్టిన రోజునుంచే రైట్స్ సొంతం చేసుకునేందుకు బయ్యర్లు క్యూలో ఉంటారు. ఇప్పుడు #RRR సినిమా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. తెలుగు వెర్షన్ వరకూ తీసుకుంటేనే ఇద్దరు టాప్ స్టార్లయిన ఎన్టీఆర్.. చరణ్ మల్టిస్టారర్. పైగా రాజమౌళి బ్రాండ్. ఇక ఇండియా లెవెల్ లో రాజమౌళి ఫాలోయింగ్ భారీగా ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ కు భారీ డిమాండే ఉంది.

అంతా బాగానే ఉందిగానీ ఈ డీల్స్ ఏవి కూడా నిర్మాత దానయ్య ఫైనలైజ్ చేసే అవకాశం లేదట. సహజంగా ఏ సినిమాకైనా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసేది ఆ సినిమా నిర్మాతే. కానీ జక్కన్న ప్రాజెక్టులో మాత్రం అలా ఉండదు. ఎందుకంటే సినిమా మొదలు పెట్టే సమయానికి రిలీజ్ చేసే సమయానికి ఆ డిమాండ్ రెండింతలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. పైగా మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. అందుకే #RRR కు సంబంధించి తనకు తెలియకుండా ఎలాంటి డీల్స్ ఫైనలైజ్ చేయవద్దని ఇప్పటికే దానయ్యకు సూచించాడట. దానికింకా సమయం ఉందని.. అప్పుడు కూడా ఆ డీల్స్ విషయం అందరూ కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పాడట. అంటే ఈ సినిమాకు సంబంధించిన బిజెనెస్ డీల్స్ ఫైనలైజ్ చేయబోయేది రాజమౌళి కుటుంబమే.

ఈలెక్కన సినిమాకు మనీ పూలింగ్ మాత్రమే దానయ్యకు ఉన్న ముఖ్యమైన బాధ్యత. కర్త కర్మ క్రియ అంతా రాజమౌళి. దేశానికి ప్రధాని ఎలాగో అలాగ. దానయ్య మాత్రం రాష్ట్రపతి లాగా. సంతకం అవసరం కానీ నిర్ణయాలు మాత్రం ప్రధానే తీసుకుంటాడు. ఒకరకంగా దానయ్యకు పని తగ్గించేసినట్టే కదా!