Begin typing your search above and press return to search.

హా హా హా కాపీ కొట్టినవి వదిలేసి..

By:  Tupaki Desk   |   4 Aug 2015 3:40 PM GMT
హా హా హా కాపీ కొట్టినవి వదిలేసి..
X
అపజయమెరగని దర్శకుడిగా జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. తెలుగు సినిమా స్టామినాని 500కోట్లకు పెంచాడు. బాహుబలి చిత్రంతో అసాధారణ విజయాన్ని అందించాడు. తెలుగువాడు గర్వించదగ్గ దర్శకుడు అనిపించుకున్నాడు. అయితే అతడిపై విమర్శలు కూడా అంతే పెద్ద స్థాయిలో ఉన్నాయి. కాపీ క్యాట్‌ కథలు రాస్తాడని, కొన్ని సీన్స్‌ హాలీవుడ్‌ నుంచి ఎత్తేస్తాడని, పోస్టర్లు కూడా కాపీ చేసేస్తాడని గతంలో విమర్శకులు గళమెత్తారు.

బాహుబలి విషయంలోనూ రచ్చ రచ్చ చేశారు. ఓ స్త్రీ మూర్తి (శివగామి)పసిబిడ్డను అరచేత ఎత్తిపట్టి ఓ నది దాటుతుంది. నీటి వెలుపల కనిపించే అరచేతిలోని బిడ్డను పోస్టర్‌ గా ముద్రించి పెనుదుమారమే రేపాడు రాజమౌళి. ఆ పోస్టర్‌ 'ది సైమన్‌ బిర్చ్‌' అనే సినిమా నుంచి కాపీ కొట్టేశాడని ఆధారాలు సహా చూపించారు. అంతేనా గతంలో మగధీర 100మంది యోధులతో పోరాట సన్నివేశాన్ని 300 సినిమా నుంచి కాపీ కొట్టేశాడని అన్నారు. ఈగ సినిమాని కాక్రోచ్‌ అనే హాలీవుడ్‌ సినిమా నుంచి కాపీ కొట్టేశారని విమర్శించారు.

అయితే ఇదే ప్రశ్నకు రాజమౌళి ఓపెన్‌ గా స్పందించాడు. చిన్నప్పట్నుంచి హాలీవుడ్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. అవి సబ్‌ కాన్షియస్‌ మైండ్‌ లో ఉండిపోయాయి. వాటి ప్రభావం నా సినిమాలపై ఉంటుంది. ఏదైనా కాపీ వచ్చినా అది యాధృచ్ఛికమేనని అన్నాడు. కాపీ కొడుతున్నది నిజమే.. కానీ అది పర్టిక్యులర్‌ గా కాదు.. అని క్లూ ఇచ్చాడు. ఏవో కొన్ని సన్నివేశాలు, లేదా షాట్స్‌ లో హాలీవుడ్‌ ప్రభావం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాడు.

బాహుబలి సినిమాలో కట్టప్ప అమరేంద్ర బాహుబలి కాలిని చేత్తో ఎత్తి నెత్తిమీద పెట్టుకుంటాడు. మీరు రాజు, నేను బానిస అన్న అర్థాన్ని చెప్పే సన్నివేశమది. దీనిని 'ఛెంగీజ్‌ ఖాన్‌' (1965) అనే సినిమా నుంచి కాపీ కొట్టాను. కానీ దీన్ని ఎవరూ గుర్తించలేదు. ఒరిజినల్‌ గా తీసిన షాట్స్‌ ని మాత్రం కాపీ అంటూ విమర్శించారని జక్కన్న పకపకా నవ్వేశాడు. పిచ్చాళ్లు .. నేను కాపీ చేస్తే.. మీరు పట్టేసేవాళ్లా? అన్నట్టు వేళాకోళం ఎక్స్‌ ప్రెషన్‌ ఇచ్చాడు. టీఆర్‌ పీ ఆటలో చిచ్చు ఇదంతా ముఖకవళికల్లోనే చూపించాడు. అదీ సంగతి.