చరణ్ తారక్ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వొచ్చు

Mon Feb 11 2019 13:15:47 GMT+0530 (IST)

స్టార్ హీరో ఎవరైనా సరే రాజమౌళికి కమిటయ్యాడు అని తెలిస్తే చాలు అభిమానులకు టెన్షన్. ఎక్కడ తమ హీరో రెండు మూడేళ్లు బ్లాక్ అయిపోతాడో అని. అలాంటిది ఏకంగా ఇద్దరు క్రేజీ టాప్ మోస్ట్ కథానాయకులు ఓకే చెబితే ఇక చెప్పేది ఏముంది. ఇది ఎంత కాలం పడుతుందో అని మెగా అండ్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ జాయింట్ గా ఆందోళన చెందారు. ఒకవేళ అదే నిజమైతే ఇంకో రెండేళ్ల వరకు ఆర్ ఆర్ ఆర్ తప్ప మరో సినిమా చేసే ఛాన్స్ ఉండదు.అయితే దీనికి బాహుబలి లాగా కాకుండా ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేస్తానని జక్కన్న హామీ ఇచ్చేశాడట. గ్రాఫిక్స్ వర్క్ అధికంగా ఉన్న కారణంగా దానికి ఆరు నెలలు టైం కేటాయించి 2020 వేసవికి రిలీజ్ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం. సో తారక్ చరణ్ లు హ్యాపీ. వచ్చే జనవరి నుంచే వేరే షూటింగ్స్ లో పాల్గొనవచ్చు.

ఇది చరణ్ కి ఇబ్బంది కలిగించేది కాదు. ఎందుకంటే 2018లో రంగస్థలం 19లో వినయ విధేయ రామ 20లో ఆర్ ఆర్ ఆర్ ఇలా లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు 2019 పూర్తి ఖాళీగా ఉంటుంది. వేరే సినిమా విడుదలయ్యే ఛాన్స్ కూడా లేదు. ఆర్ ఆర్ ఆర్ వచ్చాక మరో సినిమా 2021లో కానీ రాదు. అయితేనేం ఇదంతా అవగాహనా ఉండే ఈ ఇద్దరు హీరోలు ఒప్పుకున్నారు కాబట్టి సమస్య లేదు. ఇప్పటికే లీకవుతున్న ఫోటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. హీరోలు కాకుండా ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన ఆర్టిస్ట్ తమిళ నటుడు సముతిరఖని ఒక్కడే. హీరోయిన్ల వేట ఇంకా సాగుతూనే ఉంది