Begin typing your search above and press return to search.

బాహుబలి క్లైమాక్స్ గురించి జక్కన్న..

By:  Tupaki Desk   |   27 July 2015 1:53 PM GMT
బాహుబలి క్లైమాక్స్ గురించి జక్కన్న..
X
బాహుబలి సినిమా మీద ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. చాలా మంది చేసిన కంప్లైంట్ క్లైమాక్స్ విషయంలోనే. సినిమాను రెండు భాగాలుగా తీసినప్పటికీ.. తొలి భాగానికి మామూలుగానే ముగింపు ఇవ్వాల్సిందని.. ఇంటర్వెల్ ఇచ్చినట్లు అలా ముగించాల్సింది కాదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలు రాజమౌళికి చేరడంతో ఆయన కూడా స్పందించారు. క్లైమాక్స్ గురించి జక్కన్న ఏమంటున్నాడో చూడండి.

‘‘ఇది ముందు ఒక సినిమా అనుకుని.. తర్వాత రెండు భాగాలుగా మార్చిన సినిమా. అలా అనుకున్నాక తొలి భాగాన్ని బాహుబలిని రాజుగా డిక్లేర్ చేయటంతో ముగిద్దామని అనుకున్నాను. కానీ ఏదన్నా పొయిటిక్ సస్పెన్స్ తో ఉండే ట్విస్ట్ ఉంటే బాగుంటున్నాను. కానీ అది ప్రేక్షకులకు రూడ్ షాక్ గా ఉండకూడదనున్నాను. అందుకే కట్టప్ప బాహుబలిని చంపిన సీన్ తో తొలి భాగాన్ని ముగించాను" అని చెప్పారు.

తొలి భాగం చూసి వచ్చిన సందేహాలన్నింటికీ రెండో భాగంలో సమాధానాలు లభిస్తాయని.. రెండో భాగం చూశాక ప్రేక్షకుడికి కడుపు నిండిన భావన కలుగుతుందని రాజమౌళి చెప్పాడు. మిగిలిన అరవై శాతం షూటింగ్ చేయడానికి ఎక్కువ సమయమేమీ పట్టదని.. ఐతే పోస్ట్ ప్రొడక్షన్ కు మాత్రం చాలా సమయం పడుతుందని.. తొలి భాగం కంటే ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని జక్కన్న తెలిపాడు.