Begin typing your search above and press return to search.

ఓ పక్క లావణ్య.. మరోపక్క జక్కన్న

By:  Tupaki Desk   |   8 Oct 2015 3:30 PM GMT
ఓ పక్క లావణ్య.. మరోపక్క జక్కన్న
X
లచ్చిందేవికి ఓ లెక్కుంది.. షార్టుగా ఎల్.ఒ.ఎల్.. ఈ సినిమా మొదలైనపుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసినపుడు.. జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సడెన్ గా ఇప్పుడీ మూవీ మీద ఆసక్తి పెరుగుతోంది. అందాల రాక్షసి జంట నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ఇది. ఐతే నవీన్ కు ఆ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేమీ చేయలేదు. లావణ్య హిట్లు కొట్టినా ఆమెకూ పెద్దగా పేరు రాలేదు. ఐతే నెల కిందటి వరకు పరిస్థితి వేరు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యాక లావణ్యకు టాలీవుడ్ లో బంపర్ క్రేజ్ వచ్చేసింది. ప్రేక్షకుల్లోనూ లావణ్య సినిమాల మీద ఆసక్తి పెరిగింది.

‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’లో లావణ్య అవతారం కూడా ఆసక్తి రేపుతుండటంతో సినిమాకు క్రేజ్ నెమ్మదిగా పెరుగుతోంది. ఇంతలో ఈ నెల 11న ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. జక్కన్న అంత ఈజీగా వేరే సినిమాల ఆడియో ఫంక్షన్లకు రాడు. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ లాంటి చిన్న సినిమాకు వస్తున్నాడంటే దానికి ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా దర్శకుడు జగదీష్ తలసిల రాజమౌళికి శిష్యుడు. అంతే కాదు.. రాజమౌళి అన్నయ్య కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఆయన రాజమౌళివి కాకుండా వేరే సినిమాలకు సంగీతం ఇవ్వాలంటే అవి చాలా స్పెషల్ అయి ఉండాలి. మొత్తానికి ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ కాంబినేషన్ బాగానే ఆసక్తి రేపుతోంది. జక్కన్న వస్తున్నాడు కాబట్టి ఆడియో ఫంక్షన్ తర్వాత సినిమాకు మరింత క్రేజ్ రావడం ఖాయం. నవంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు.