Begin typing your search above and press return to search.

ఇల్లీ చెత్త సినిమాకి జక్కన్న పొగడ్తలు

By:  Tupaki Desk   |   17 March 2018 9:59 AM GMT
ఇల్లీ చెత్త సినిమాకి జక్కన్న పొగడ్తలు
X
దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమాను పొగడ్డం అంటే.. కచ్చితంగా అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుందని జనాలు అనుకుంటారు. ఓ యాక్టర్ ని పొగిడినా ఇలాగే భావిస్తారు. ఈ మధ్య కాలంలో ఈయన ట్వీట్స్ పై కొన్ని విమర్శలు వచ్చినా.. జక్కన్న జడ్జిమెంట్ పై జనాలకు గురి ఉంది. అలాంటిది ఆయన ఓ సినిమాను చెత్త మూవీగా అభివర్ణించారంటే ఇక ఆ సినిమా పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

కొన్నేళ్ల క్రితం గోవా బ్యూటీ ఇలియానా దక్షిణాదిలో ఓ సినిమా చేశానని చెప్పింది. మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఇది డిజాస్టర్ మూవీ అనే సంగతి అర్ధమయిపోయిందట. ముందే కొంచెం డౌట్ ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా ఒప్పుకున్నట్లు చెప్పిన ఇలియానా.. అదే సిట్యుయేషన్స్ కారణంగా కంటిన్యూ చేసిందట. కానీ ఆ సినిమా కోసం తాను 100 శాతం తన కష్టాన్ని అందించానని చెప్పింది ఇలియానా. చివరకు అనుకున్నట్లుగానే ఆ మూవీ ఘోరమైన డిజాస్టర్ గా నిలిచిందట. ఆ తర్వాత ఓ హోటల్ లాబీలో రాజమౌళి కలవగా.. ఆ చెత్త సినిమా తను చూసినట్లు చెప్పాడట ఆయన.

సినిమా ఎంత చెత్తగా ఉన్నా.. ఇలియానా నటన మాత్రం అద్భుతం అని.. హండ్రెడ్ పర్సెంట్ మూవీ కోసం కష్టపడ్డావని పొగిడారని చెప్పింది ఇల్లీ బేబీ. అదే తనకు పెద్ద అవార్డ్ లా భావించిందట ఇలియానా. రిజల్ట్ ఎలా ఉన్నా.. సినిమా కోసం కష్టపడడం నటుల బాధ్యత అని ఇల్లీ ఉవాచ. అంతా బాగానే ఉంది కానీ.. ఆ చెత్త సినిమా ఏంటో.. దాన్ని ఒప్పుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏంటో కూడా ఇలియానా కానీ.. రాజమౌళి కానీ చెప్పచ్చు కదా.