Begin typing your search above and press return to search.

15 సంవత్సరాల నుండి అవే బ్లాక్ బస్టర్లు

By:  Tupaki Desk   |   27 Sep 2016 11:30 AM GMT
15 సంవత్సరాల నుండి అవే బ్లాక్ బస్టర్లు
X
అది సెప్టెంబర్ 27, 2001. ఆ తేదీని ఎవ్వరు మర్చిపోయినా కూడా ఇద్దరు మాత్రం మర్చిపోరు. ఒకటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. రెండోది బ్లాక్ బస్టర్ సినిమాలను ఎంజాయ్ చేసే తెలుగు ప్రేక్షకులు. అప్పటివరకు టివి సీరియల్స్ ను డైరక్ట్ చేస్తున్న శ్రీశైలశ్రీ రాజమౌళి అనే ఓ దర్శకుడు.. కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ''స్టూడెంట్ నెం.1'' అనే సినిమాను తీసి ఆ రోజున రిలీజ్ చేశాడు. సినిమా అతి పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోయింది.

ఆ తరువాత నుండి వరుసగా అవే బ్లాక్ బస్టర్లనే తీస్తున్నాడు రాజమౌళి. ఒక ప్రక్కన ఆ సినిమాతో జూ.ఎన్టీఆర్ ఒక మాస్ హీరోగా ఎదిగిపోగా.. మరో ప్రక్కన రాజమౌళి మాత్రం సింహాద్రి - ఛత్రపతి - సై - విక్రమార్కుడు - మగధీర - మర్యాద రామన్న - ఈగ - బాహుబలి వంటి సినిమాలతో అలరించేశాడు. అన్నీ హిట్లే. అన్నీ డిఫరెంట్ సినిమాలే. మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్యాంగుల నుండి విభిన్న యాక్షన్ సీక్వెన్సులు తీయడం రాజమౌళికే సొంతం. సరిగ్గా ఈరోజుతో స్టూడెంట్ నెం.1 సినిమా విడుదలై 15 సంవత్సరాలు అయ్యింది. అంటే రాజమౌళి కూడా 15 బ్లాక్ బస్టర్ సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడనమాట.

అదే విధంగా ఎన్టీఆర్ కూడా అప్పటికి నిన్ను చూడాలని వంటి పాయింట్ లెస్ సినిమాలను చేస్తూ ఉన్నప్పుడు.. ఈ స్టూడెంట్ నెం.1 అనేది అతని దశను పర్ఫెక్ట్ గా మార్చేసింది. ఒక సింపుల్ హీరో నుండి యంగ్ టైగర్ రేంజుకు ఎదిగాడు. బాక్సాఫీస్ ను శాసిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇటు రాజమౌళికి అటు ఎన్టీఆర్ కు కంగ్రాట్స్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/