Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గా మారుతున్న రాజమౌళి మరో అసిస్టెంట్

By:  Tupaki Desk   |   4 May 2016 10:30 PM GMT
డైరెక్టర్ గా మారుతున్న రాజమౌళి మరో అసిస్టెంట్
X
స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి వద్ద పనిచేసిన మరో అసిస్టెంట్ డైరెక్టర్ దర్శకుడిగా మారబోతున్నాడు. గతంలో రాజమౌళి టీమ్ నుంచి చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు బయటకొచ్చి డైరెక్టర్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా మరో అసిస్టెంట్ డైరెక్టర్ పళని మోగా ఫోన్ పట్టబోతున్నట్టు సమాచారం. ఇతను బాహుబలి చిత్రానికి రాజమౌళి వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు దర్శకుడిగా తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు.

'వినవయ్యా రామయ్య' ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమాకు ఇప్పటికే చాలా స్క్రిప్టులు విన్నాడు. వాటిలో పళని చెప్పిన కథ బాగా నచ్చడంతో ఓకే చేసినట్టు తెలిసింది. యువ హీరో తన రెండో సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రిలో నిలవాలని చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రాజెక్టును ఓకే చేశాడట. పళని.. బాహుబలికి సహాయ దర్శకుడిగా పనిచేయడం వల్ల అపారమైన అనుభవం వుంటుందని.. అతడు చెప్పిన కథను ఫైనల్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

నాగ్ అన్వేష్ నాన్న టాలీవుడ్లో మంచి అనుభవం వున్న వ్యక్తి కావడంతో.. తన కుమారుడి కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేయడానికి తొందర పడకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు.. ప్రధాన తారాగణం ఎవరనేది తెలియనుంది. ఈ ప్రాజెక్ట్ లో నాగ అన్వేష్ ను 'బాహుబలి' పళని నాగ్ అన్వేష్ ను ఎలా చూపబోతున్నాడో.. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల్ని ఏస్థాయిలో మెప్పిస్తారో చూడాలి.