Begin typing your search above and press return to search.

రాజమౌళితో తారక్ షార్ట్ ఫిలిం

By:  Tupaki Desk   |   19 Feb 2018 12:24 PM GMT
రాజమౌళితో తారక్ షార్ట్ ఫిలిం
X
బాహుబలి 2 తర్వాత బాగా గ్యాప్ తీసేసుకున్న రాజమౌళి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. కాని ఈసారి సినిమాతో కాదు. ఒక మంచి ఉద్దేశం కోసం రూపొందిన షార్ట్ ఫిలింతో. నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతూ అమాయకులైన ప్రజలు వీటి బారిన పడి లక్షలు, కోట్లలో తమ విలువైన కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. దానికి తోడు టెక్నాలజీ అతి తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాక యువత దాని వ్యామోహంలో పడి తమ నిండు జీవితాల్ని కోల్పోవడమే కాక వ్యామోహాల ఉచ్చులో పడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు జంట నగరాల్లో నమోదు అవుతున్న కేసుల్లో సగానికి పైగా సైబర్ క్రైమ్ విభాగంలోనే ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీన్ని సరిదిద్దే క్రమంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు నడుం బిగించింది సిటి పోలీస్.

అందులో భాగంగానే రాజమౌళితో ఒక షార్ట్ ఫిలిం తీయించారు. ఎవరో ఒకరు నటిస్తే మన ప్రేక్షకులు పట్టించుకోరు కాబట్టి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఇందులో ఒక పాత్ర చేయించారు. ఇవాల్టి నుంచి దీన్ని థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. పివిఆర్ మల్టీ ప్లెక్స్ లో హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వివి శ్రీనివాసరావు దీన్ని అధికారికంగా విడుదల చేసారు. మరికొద్ది గంటల్లో ఆన్ లైన్ మీడియాలో కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. రాజమౌళి టేకింగ్ కాబట్టి జనాలు సాధారణంగానే ఆసక్తి చూపిస్తారు. అందులో తారక్ ఉంటాడు అంటే త్వరగా కనెక్ట్ అవుతుంది అనడంలో సందేహం అక్కర్లేదు.

సోషల్ మెసేజ్ ఉన్న ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ లో హీరోలు నటించడం వల్ల ప్రజలకు మెసేజ్ త్వరగా చేరుతుంది. గతంలో ఎయిడ్స్ - క్యాన్సర్ - చైల్డ్ లేబర్ లాంటివి ప్రమోట్ చేయటం కోసం టాలీవుడ్ హీరోలు క్యాంపెయిన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా క్షణాల్లో వైరల్ అవుతోంది కాబట్టి వాళ్ళను ఎడ్యుకేట్ చేయడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.