చిరంజీవికి రాజశేఖర్ ఛాలెంజ్

Wed Aug 22 2018 12:22:50 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవికి యాంగ్రీమేన్ రాజశేఖర్ చాలెంజ్ విసురుతున్నారా?  అంటే అవుననే తాజాగా సంకేతం అందింది. ఆ మేరకు నేటి ఉదయం మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెబుతూ రాజశేఖర్ కాంపౌండ్ నుంచి ఓ వార్త వెలువడింది. ఆ వార్తతో పాటే ఒక ఆసక్తికరమైన పోస్టర్ ని రాజశేఖర్ పీఆర్ బృందం పంపించింది. దాని సారాంశం .. రాజశేఖర్ ఈజ్ బ్యాక్ ఎగైన్! అనే. ఎందుకంటే పీఆర్ పంపించిన అప్పటి పాత పోస్టర్ లో మెగాస్టార్ - యాంగ్రీయంగ్ మేన్ వార్తలు ప్రధానంగా అచ్చయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నాడు `ఖైదీ` సినిమాతో సంచలనాలు సృష్టించారు. అప్పట్లో ఖైదీ - రిలీజింగ్ టుడే! అంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తను .. అదే పేజీలో డా.రాజశేఖర్ ఇన్ ఏ న్యూ `అవతార్` టైటిల్ లాంచ్ ఆన్ 26 ఆగస్ట్! అంటూ బ్యానర్ వార్త ప్రచురితమైంది. అంటే ఆరోజుల్లో రాజశేఖర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అయితే అది తెలుగులో కాదు వేరొక భాషలో. భారతీరాజా దర్శకత్వంలో రాజశేఖర్ అప్పట్లోనే తమిళ చిత్రాల్లో నటించి కాన్ఫిడెన్స్ తో ఉన్నారన్నమాట.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `ఖైదీనంబర్ 150` సినిమాతో పునరారంగేట్రం చేసిన తీరు గ్రాండ్ సక్సెసైంది. అదే ఏడాది రాజశేఖర్ సైతం `పిఎస్ వి గరుడవేగ` చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇద్దరూ హిట్టు కొట్టి స్పీడుమీదున్నారు. మెగాస్టార్ ఇప్పటికే ఇండస్ట్రీ బెస్ట్ `సైరా-నరసింహారెడ్డి` చిత్రంతో సంచలనాలకు సిద్ధమవుతున్నారు. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే పిఎస్ వి గరుడవేగ తర్వాత స్క్రిప్టు పరంగా రాజశేఖర్ ఆచితూచి అడుగులేస్తున్నాడు. 1983 కాలంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో రాజశేఖర్ నటించనున్నారన్న అధికారిక ప్రకటన వెలువడింది. ఇన్వెస్టిగేషన్ అంటే మగాడు తరహాలోనే సీరియస్ కాప్ గానే రాజశేఖర్ నటించనున్నారని అర్థమవుతోంది. అయితే ఓ రకంగా మెగాస్టార్ తరహాలోనే తాను కూడా సక్సెస్ స్ట్రీక్ లోకి వచ్చానని చెబుతూనే మెగాస్టార్ ఖైదీ పోస్టర్ ని ట్వీట్ చేసి నేటి బర్త్ డే బోయ్ చిరంజీవికి రాజశేఖర్ శుభాకాంక్షలు చెప్పారా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సైరా టీజర్ ఈవెంట్ లో పరుచూరి అన్నట్టు.. ఎదిగేవాళ్లను చూస్తూ మనం కూడా ఎదగాలన్న పోటీతత్వం గొప్పది! అలాంటి తత్వాన్ని రాజశేఖర్ చూపించడం ఆహ్వానించదగ్గది. అందుకు మెగా ఫ్యాన్స్ ఆల్వేస్ వెల్ కం చెబుతారనడంలో సందేహం లేదు.