Begin typing your search above and press return to search.

రాజు గారి గది-2కు పంచ్ పడిందే..

By:  Tupaki Desk   |   17 Oct 2017 10:26 AM GMT
రాజు గారి గది-2కు పంచ్ పడిందే..
X
గత శుక్రవారం రిలీజైన అక్కినేని నాగార్జున సినిమా ‘రాజు గారి గది-2’ తొలి వీకెండ్లో మంచి ఓపెనింగ్సే రాబట్టింది. మూడు రోజుల్లో రూ.11 కోట్ల దాకా షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర శుభారంభం చేసింది. దీంతో ఇటు నిర్మాతలు.. అటు బయ్యర్లు చాలా సంతోషంగా కనిపించారు. ఇది తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కావడం.. బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే జరగడంతో సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తుందని అంచనా వేశారు. ఐతే ఆశ్చర్యకరంగా వీకెండ్ అవ్వగానే ఈ సినిమా వీక్ అయిపోయింది. సోమవారం పరీక్షకు ‘రాజు గారి గది-2’ నిలవలేకపోయింది. సోమవారం లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది కానీ.. పరిస్థితి ఆశాజనకంగా అయితే లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

వీకెండ్ అవ్వగానే కలెక్షన్లలో పెద్ద డ్రాప్ కనిపిస్తోందని అంటున్నారు. ‘రాజు గారి గది-2’కి పెద్దగా స్కోప్ ఇవ్వకుండా ఈ బుధవారమే రెండు దీపావళి సినిమాలు రిలీజైపోతున్నాయి. ‘రాజా ది గ్రేట్’తో పాటు తమిళ డబ్బింగ్ మూవీ ‘అదిరింది’ కూడా బుధవారమే రిలీజవుతోంది. ఈ రెండు సినిమాల మీద అంచనాలు బాగానే ఉన్నాయి. వీటిలో ‘రాజా ది గ్రేట్’కు పాజిటివ్ టాక్ వస్తే ‘రాజు గారి గది-2’కు పంచ్ పడటం ఖాయం. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.24 కోట్లకు అమ్మారు. అంటే ఇప్పటికి సగం బడ్జెటే రికవరైంది. ఇంకా సగం వసూలు కావాల్సి ఉంది. ఈ వారాంతంలో కొత్త సినిమాల పోటీని తట్టుకుని ‘రాజు గారి గది-2’ ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నదాన్ని బట్టి ఆ సినిమా అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుంది.