Begin typing your search above and press return to search.

రాజా ది గ్రేట్.. మహేష్‌ బాబు గుర్తొచ్చాడు

By:  Tupaki Desk   |   20 Oct 2017 10:26 AM GMT
రాజా ది గ్రేట్.. మహేష్‌ బాబు గుర్తొచ్చాడు
X
ఇప్పుడు రాజా ది గ్రేట్ సినిమాను మరింత ప్రమోట్ చేసేందుకు.. ఈరోజు సినిమా టీమ్ అంతా కలసి 'దేవనార్ బ్లయిండ్ స్కూల్' కు వెళ్ళింది. బాగానే ఉంది. సినిమాలో హీరో అంధుడి పాత్రను చేశాడు కాబట్టి.. వీరు అక్కడికి విచ్చేసి పిల్లలకు ఏవో కానుకలు గట్రా పంచినట్లున్నారు. కాని విషయం ఏంటంటే.. ఇదంతా మనస్సులో సాయం చేయాలని అనిపించి చేస్తున్నట్లా? లేదంటే సినిమా ప్రమోషన్ కోసం చేసుకుంటున్నట్లా?

ఇప్పటివరకు రాజా ది గ్రేట్ సినిమాలో టీమ్ మెంబర్లు ఎవరూ మనకు ఆ బ్లయిండ్ స్కూల్ దగ్గరకు వెళ్ళినట్లు ఎప్పుడూ దాఖలాలే లేవు. అంటే ఇప్పుడు సడన్ గా ఆ స్కూల్ గుర్తొచ్చిందంటే.. మరి ప్రమోషన్ల కోసం వెళ్ళినట్లేగా అంటున్నారు జనాలు. సరిగ్గా ఇదే సమయంలో కొంతమంది సినిమా లవ్వర్లు మహేష్‌ బాబు గురించి గుర్తుతెచ్చుకుంటున్నారు. మహేష్‌ కు ఊరుని దత్తత తీసుకుందాం అనే ఐడియా ముందే వచ్చినప్పటికీ.. కరక్టుగా శ్రీమంతుడు సినిమా వస్తున్న టైములో దానిని ప్రకటిస్తే అది ఖచ్చితంగా సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నా అని అనుకుంటారు కాబట్టి.. కాస్త లేట్ చేసి బుర్రిపాలెం గ్రామం గురించి చెప్పినట్లు తెలిపాడు.

అదంతా చూస్తే.. ఇప్పుడు రవితేజ్ దిల్ రాజు అండ్ గ్యాంగ్ కూడా.. సినిమా ధియేటర్లలో నుండి వెళిపోయాక ఇలా బ్లయిండ్ స్కూల్ కు వెళ్ళుంటే.. అది చాలా గొప్పగా అనిపించేది. కాని ఇప్పుడు సడన్ గా అక్కడకు పరిగెత్తడం చూస్తుంటే మాత్రం.. ఇదేదో ప్రమోషన్ల కోసం హడావుడి అన్నట్లుగానే ఉంది.