రాజా.. టీజర్ తో వస్తున్నాడట..

Sat Aug 12 2017 12:46:46 GMT+0530 (IST)

ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ వ్యవహారంతో సతమతమయిన టాలీవుడ్ ఇప్పుడిపుడే కాస్త కోలుకుంటోంది. జరిగిన పరిణామాలన్నిటిని మరచిపోయి ఇక నుంచి ఆలాంటి తరహా వ్యవహారాలు నడవకుండా జాగ్రత్త పడటానికి చర్యలు తీసుకుంటోంది. అయితే విచారణను ఎదుర్కొన్న కొంత మంది తారలు చాలా ఇబ్బందులనే ఎదుర్కొన్నారని చెప్పాలి. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం 12 మంది స్టార్లు విచారణకు హాజరైన సంగతి తెలిసందే.

అయితే ఎవరు ఊహించని విధంగా రవితేజపై చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. మీడియాల్లో కూడా అతని పేరు బాగా వినబడటంతో అతని కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. అసలే తమ్ముడి మరణంతో బాధలో ఉన్న ఆ కుటుంబానికి రవితేజ డ్రగ్స్ వ్యవహారం కోలుకోలేని దెబ్బనే ఇచ్చింది. అయితే  చాలా మంది రవితేజకు సపోర్ట్ గానే నిలిచారు అభిమానులు సినీ ప్రముఖులు. రవి తేజ కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. జరిగేవి జరుగుతూనే ఉంటాయని తన పని తాను చేసుకుంటూ.. షూటింగ్స్ లో బిజీ అయిపోయాడు.

అయితే ఈ వ్యవహారం అంతా ముగిసిన తర్వాత ఆయన ప్రస్తుతం నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలోని మరో పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే టైటిల్ తో ఆకట్టుకున్న ఈ సినిమా కథలోని పాత్రను కూడా చెప్పడంతో రవి తేజ బ్లైండ్ గా ఎలా నటిస్తాడు అనే దానిపై ఆసక్తిని రేపింది. చాలా రోజుల తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో నటిస్తున్నాడు రవి తేజ. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 15న వస్తుందని చెప్పేశారు. ఆ టీజర్ వచ్చాక అసలు ఈ డ్రగ్స్ మ్యాటరే మర్చిపోతారని ఇన్సైడ్ టాక్. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో.