Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ భయపడ్డట్లే ఉన్నాడు

By:  Tupaki Desk   |   7 Feb 2016 1:30 PM GMT
రాజ్ తరుణ్ భయపడ్డట్లే ఉన్నాడు
X
హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్‌ కు సక్సెస్ మత్తు ఇప్పుడిప్పుడే వదలుతున్నట్లుంది. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టేద్దామని ఆశపడ్డాడు కానీ.. ఆ సినిమాకు అంత సీన్ లేదని త్వరగానే తేలిపోయింది. తొలి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా సినిమా బాక్సాఫీస్ పరీక్షకు నిలవలేదు. దీంతో కుర్రాడి ఖాతాలో తొలి ఫ్లాప్ పడ్డట్లే అని ఖరారు చేసేశాడు ట్రేడ్ పండిట్స్. ఇప్పుడిక తన తర్వాతి ప్రాజెక్టుల విషయంలో రాజ్ జాగ్రత్త పడాల్సిందే.

తొలి మూడు సినిమాలు చూసి రాజ్ పై జనాలు బాగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ‘సీతమ్మ అందాలు..’ చూస్తే ఇతనేంటి ఇలాంటి సినిమాలు చేశాడు అన్న ఫీలింగ్ కలిగింది. ఇలాంటి సినిమాలు ఇంకో ఒకటి రెండు చేశాడంటే వరుణ్ సందేశ్ బాటలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. అందుకే కుర్రాడు కొంచెం అప్రమత్తం అవుతున్నట్లున్నాడు. ఈ జాగ్రత్తలో భాగంగా సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో ‘ఫ్యాషన్ డిజైనర్’ చేసే విషయంలో పునరాలోచిస్తున్నాడట రాజ్.

ఒకప్పుడు క్లాసిక్స్ అందించిన వంశీ.. గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో తెలిసిందే. అందులో ఆయన లేటెస్టుగా అందించిన కళాఖండం ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ జనాలకు చుక్కలు చూపిస్తోంది. వంశీ తన టచ్ పూర్తిగా కోల్పోయాడని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొహమాటానికి పోయి ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం ప్రమాదమని భావించి రాజ్ తరుణ్ సైడైపోతున్నట్లు సమాచారం. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాతలతో పని చేయాల్సి ఉన్న రాజ్.. డేట్లు ఖాళీ లేవని చెప్పి వంశీ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతున్నారు.