Begin typing your search above and press return to search.

లేడీ డైరెక్టర్ తో కుర్రాడి మూవీ రీస్టార్ట్

By:  Tupaki Desk   |   20 April 2017 5:59 AM GMT
లేడీ డైరెక్టర్ తో కుర్రాడి మూవీ రీస్టార్ట్
X
యంగ్ హీరో రాజ్ తరుణ్ ఫుల్ స్పీడ్ లో సినిమాలు చేసేస్తుంటాడు. ఏడాది 2.. 3.. సినిమాల చొప్పున కూడా విడుదల చేసేంతటి స్పీడ్ అన్నమాట. మార్చ్ లో కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త మూవీని రాజ్ తరుణ్ రిలీజ్ చేయగా.. ఈ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లనే సాధించింది. ప్రస్తుతం అంధగాడు అంటూ మరో మూవీని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు ఈ కుర్రాడు.

ఈ అంధగాడు సమ్మర్ లోనే విడుదలయ్యే అవకాశాలుండగా.. మే నెలలో సరైన డేట్ కోసం చూస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఏకే ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ పై నిర్మించినవే కావడం విశేషం. ఈ రెండు సినిమాల కంటే ముందే సంజనా రెడ్డి అనే కొత్త లేడీ డైరెక్టర్ తో ఓ మూవీ స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో. కొన్ని వారాల షూటింగ్ తర్వాత అప్పట్లో ఈ మూవీని ఆపేసి.. ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు మళ్లీ సంజనా రెడ్డి దర్శకత్వంలో రూపొందే సినిమాకు డేట్స్ కేటాయించాడట రాజ్ తరుణ్. మే మొదటి వారం నుంచి ఈ మూవీ షూటింగ్ నిరవధికంగా సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఏకే ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని ప్రధానమైన సీన్స్ చిత్రీకరణ పూర్తవడంతో.. రెండు-మూడు నెలల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కూడా రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తుండగా.. ఇంకా దీనికి కొన్ని రోజుల షూటింగ్ పార్ట్ మాత్రమే చేయాల్సి ఉంది. అంటే ఈ ఏడాది కనీసం 4 సినిమాలు విడుదల చేయనున్నాడు రాజ్ తరుణ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/