ఈ పిలక జాతకం మార్చుతుందేమో..

Mon Jun 18 2018 11:22:34 GMT+0530 (IST)

టాలీవుడ్ లో అడుగుపెట్టగానే హిట్టు అందుకున్న యువ హీరోలు కొన్నేళ్ల తరువాత ఫెడవుట్ అయిపోతున్నారు. అయితే అందులో ఎక్కువగా లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళే ఉన్నారు. కెరీర్ లో చిన్నపాటి తొందర కారణాలతో కెరీర్ ను ఫెయిల్యూర్ లోకి నెట్టేసుకుంటున్నారు. గతంలో తరుణ్ ఉదయ్ కిరణ్ లాంటి హీరోల్లాగానే నేటితరం యువ హీరో రాజ్ తరుణ్ కూడా ఫెయిల్యూర్ బాట పడుతున్నాడు.మనోడికి మొదటి మూడు సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా యూత్ లో అయితే క్రేజ్ బాగానే అందింది. కానీ ఆ క్రేజ్ ను రాజ్ తరుణ్ ఎక్కువ రోజులు నిలుపుకోలేకపోయాడు.  వరుస డిజాస్టర్స్ తో కొద్దీ కాలంలోనే ఫెడవుట్ అవుతున్నాడు. ఆ మధ్య శతమానం భవతి అఫర్ ని మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఈ హీరో దిల్ రాజుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో ఎండ్ అవుతుంది.

అయితే అందులో రాజ్ తరుణ్ కొత్త స్టైల్ లో కనిపించనున్నాడు. పోనీ టైల్ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గతంలో చాలా మంది హీరోలు పిలక పెట్టి ట్రెండ్ సెట్ చేశారు. మళ్లీ చాలా రోజుల తరువాత రాజ్ తరుణ్ దాన్ని చూపించాడు. మరి ఈ పిలక జాతకం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక దిల్ రాజు ప్రొడక్షన్ లో చేస్తున్న లవర్ సినిమాకు అనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెల సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.