పెళ్లిచూపులు నిర్మాతకు అరుదైన గౌరవం

Mon Mar 20 2017 13:29:05 GMT+0530 (IST)

గతేడాది రిలీజ్ అయిన పెళ్లి చూపులు చిత్రం.. సెన్సేషనల్ హిట్ సాధించింది. చిన్న సినిమాలకు ఓ బెంచ్ మార్క్ కూడా సెట్ చేసేందటి ఘన విజయం సాధించిన మూవీ పెళ్లి చూపులు. క్యాస్టింగ్ తో కాకుండా.. కేవలం కంటెంట్ తోనే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. కుటుంబ విలువలతో అందరినీ ఆకట్టుకుంది.

చక్కని కుటుంబ కథా చిత్రాలకు అవార్డు అందించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నరారు బి. వెంకటరామిరెడ్డి. తన తండ్రి బి. నాగిరెడ్డి పేరు మీద గత ఆరేళ్లుగా ఈ అవార్డును ఇవ్వడాన్ని ఆనవాయితీగా పాటిస్తున్నారు. 2016కు గాను ఈ అవార్డును పెళ్లి చూపులు చిత్రానికి అందించాలని నిర్ణయించారు వెంకటరామిరెడ్డి. పెళ్లి చూపులు లాంటి సబ్జెక్ట్ ను సాకారం చేసి.. ధైర్యంగా నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి.. ఈ అవార్డును అందుకోనున్నారు.

ప్రతీ ఏటా ఏప్రిల్ 16న బి నాగిరెడ్డి అవార్డు ప్రదాన కార్యక్రమం రాజమండ్రిలో జరుపుతుంటారు. ఈ ఏడాది కూడా అక్కడే ఈ ఫంక్షన్ జరగనుండగా.. అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి.. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/