Begin typing your search above and press return to search.

రాహుల్‌ కోసం పున్నును ఇరికించిన బిగ్‌ బాస్‌?

By:  Tupaki Desk   |   17 Sep 2019 7:35 AM GMT
రాహుల్‌ కోసం పున్నును ఇరికించిన బిగ్‌ బాస్‌?
X
బిగ్‌ బాస్‌ లో ఈవారం నామినేషన్‌ పక్రియ విభిన్నంగా సాగుతోంది. ఇంటి సభ్యులు అంతా నేరుగా నామినేట్‌ అవ్వగా వారిని సేవ్‌ చేసేందుకు బిగ్‌ బాస్‌ సూచించిన త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పునర్నవి ఎలిమినేషన్స్‌ నుండి సేవ్‌ అయ్యేందుకు రాహుల్‌ 20 గ్లాస్‌ ల కాకరకాయ జ్యూస్‌ తాగాడు. వాంతులు చేసుకుంటూ మరీ రాహుల్‌ ఆ టాస్క్‌ ను పూర్తి చేశాడు. దాంతో పునర్నవి సేవ్‌ అయ్యింది. ఇక నేటి ఎపిసోడ్‌ లో మరి కొందరు ఎలిమినేషన్‌ నుండి సేవ్‌ అవ్వాల్సి ఉంది.

రాహుల్‌ ఎలిమినేషన్‌ నామినేషన్స్‌ నుండి సేవ్‌ అయ్యేందుకు పునర్నవి ఈ సీజన్‌ మొత్తం సెల్ఫ్‌ నామినేట్‌ అయ్యేందుకు సిద్ద పడాల్సి ఉంటుందని బిగ్‌ బాస్‌ సూచించాడు. రాహుల్‌ ను సేవ్‌ చేసేందుకు పునర్నవి సీజన్‌ మొత్తం నామినేట్‌ అయ్యేందుకు ఒప్పుకుందా లేదా అనేది నేటి ఎపిసోడ్‌ లో ప్రసారం కానుంది. మొదట పునర్నవి తాను ఆ పని చేయలేను అంటూ రాహుల్‌ తో చెప్పేసినా ఆ తర్వాత బిగ్‌ బాస్‌ కాల్‌ చేసే సమయానికి మనసు మార్చుకున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.

మొత్తానికి ఈ సీజన్‌ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ జంటకు చాలా కష్టమైన టాస్క్‌ లను బిగ్‌ బాస్‌ ఇచ్చాడు. 20 గ్లాస్‌ ల కాకరకాయ జ్యూస్‌ ను పునర్నవి కోసం రాహుల్‌ తాగేసి బాబోయ్‌ అనిపించాడు. ఇక రాహుల్‌ కోసం పునర్నవి అంతకు మించి సాహసం చేసిందా లేదా అనేది నేటి ఎపిసోడ్‌ లో తేలిపోనుంది. ఒక వేళ ఒప్పుకుంటే సీజన్‌ మొత్తం నామినేట్‌ అయ్యి టెన్షన్‌ పడాల్సి వస్తుంది. ఒక వేళ ఒప్పుకోకుంటే రాహుల్‌ ను చీట్‌ చేసింది అంటూ విమర్శలు ఎదుర్కొని ప్రేక్షకుల దృష్టిలో చీప్‌ అయ్యే అవకాశం ఉంది. దాంతో పునర్నవిని గట్టిగా ఇరుక్కు పోయినట్లయ్యింది. మరి దీని నుండి పున్ను ఎలా బయట పడనుందో చూడాలి.