Begin typing your search above and press return to search.

బబ్లీ హీరో ‘శోభన్ బాబు’ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   29 Nov 2015 5:30 PM GMT
బబ్లీ హీరో ‘శోభన్ బాబు’ అవుతున్నాడు
X
గ్లామర్ అంటే హీరోయిన్ల గురించే మాట్లాడుకుంటాం. హీరోల విషయంలో ఈ చర్చ వస్తే ఇప్పటి హీరోల్లో ముందు మహేష్ బాబు గుర్తుకొస్తాడు. ఐతే తెలుగులో హీరో గ్లామర్ గురించి అందరూ చర్చించుకునేలా చేసిన హీరోల్లో శోభన్ బాబు ముందుంటారు. ఆ తరంలో ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఉండేది. అబ్బాయిలెవరైనా అందంగా రెడీ అయితే ఏంట్రా శోభన్ బాబులా తయారయ్యావ్ అనే వాళ్లు అప్పట్లో.

అలాంటి హీరో పేరుతో ఇప్పుడు ఓ సినిమా రాబోతోంది. ‘అందాల రాక్షసి’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ‘అలా ఎలా’తో నిలదొక్కుకున్న బబ్లీ హీరో రాహుల్ రవీంద్రన్ ‘శోభన్ బాబు’ పాత్ర పోషించబోతున్నాడు. జగపతి బాబుతో ‘హితుడు’ అనే సినిమా తీసిన యంగ్ డైరెక్టర్ విప్లవ్ ఈ సినిమాను రూపొందించబోతున్నాడు.

రామోజీరావు, క్రిష్ కలిసి నిర్మించిన ‘దాగుడుమూతల దండాకోర్’లో హీరోయిన్ గా నటించిన నిత్య శెట్టి ఈ సినిమాలో రాహుల్ సరసన నటించబోతోంది. కొత్త నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ కూడా నటిస్తుంది. ఇందులో హీరో పాత్ర సోగ్గాడి తరహాలో ఉంటుందని. అందుకే శోభన్ బాబు పేరు పెట్టారని అంటున్నారు. మొత్తానికి శోభన్ బాబు పేరు ఇలా మళ్లీ ఓ సినిమా ద్వారా చర్చలోకి వస్తుండటం ఆయన అభిమానులకు ఆనందాన్నిచ్చేదే.