Begin typing your search above and press return to search.

మహేష్ నం.1 మిస్ అయ్యాడు!!

By:  Tupaki Desk   |   24 Jan 2017 7:57 AM GMT
మహేష్ నం.1 మిస్ అయ్యాడు!!
X
టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో ఎవరు అనే పోటీలో మహేష్ బాబు పేరు ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. అయితే.. ఇక్కడ మిస్ అయిన నం.1 ర్యాంక్ మాత్రం సినిమాల గురించి కాదు. హైద్రాబాద్ టైమ్స్ నిర్విహించే పోల్ లో 'మోస్ట్ డిజైరబుల్ మెన్' లిస్ట్ లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు మహేష్ బాబు.

మోస్ట్ డిజైరబుల్ మెన్ 2016 జాబితాలో.. మహేష్ బాబు ర్యాంక్ నంబర్ 2కి పడిపోయింది. ఇలా మహేష్ ర్యాంక్ ను పడగొట్టింది సినిమాలకు సంబంధించిన వ్యక్తి కాకపోవడం ఆశ్చర్యకరం. ఫస్ట్ ప్లేస్ లో హైద్రాబాద్ వాసి మిస్టర్ వరల్డ్ టైటిల్ విన్నర్ అయిన రోహిత్ ఖండేల్వాల్ నిలిచాడు. రీడర్స్ ఓట్ల ప్రకారం నిర్వహించే ఈ పోల్ లో.. మహేష్ సెకండ్ ర్యాంక్ లో నిలిచాడు. 2015లో ఈ జాబితాలో టాప్ ప్లేస్ మహేష్ బాబుదే. ఈ ఏడాది ఆ ప్లేస్ ని రోహిత్ లాగేసుకున్నాడు. ఇలా ర్యాంక్ కోల్పోవడం.. తిరిగి సంపాదించడం మహేష్ కి కొత్తేమీ కాదు.

2012.. 2013ల్లో మోస్డ్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో.. మహేష్ బాబు విన్నర్. అయితే.. 2014లో మాత్రం ఈ ర్యాంక్ ను దగ్గుబాటి రానా దక్కించుకున్నాడు. ఆ తర్వాత 2015లో తిరిగి తన టాప్ ప్లేస్ తిరిగి సాధించిన మహేష్.. మరోసారి కోల్పోయాడంతే. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో.. వచ్చే ఏడాది మళ్లీ మహేష్ బాబు ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తాడని.. ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/