Begin typing your search above and press return to search.

హ్యాపీ డేస్ హీరో ఇలా అయిపోయాడేంటి?

By:  Tupaki Desk   |   8 Feb 2016 8:03 AM GMT
హ్యాపీ డేస్ హీరో ఇలా అయిపోయాడేంటి?
X
హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ గుర్తున్నాడు కదా. ఆ కుర్రాడి పేరు రాహుల్ అయినా.. ‘హ్యాపీ డేస్ టైసన్’గానే గుర్తింపు సంపాదించాడు. సన్నగా, పీలగా ఉంటాడు కాబట్టి.. సినిమాలో ఫ్రెండ్స్ అతణ్ని సెటైరిగ్గా అతణ్ని టైసన్ అంటారు. ఐతే ఆ బక్క టైసన్ ఇప్పుడు బలిష్టంగా తయారయ్యే పనిలో పడ్డాడు. టైసన్ లాగే బాడీని ప్యాక్ లుగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు రాహుల్. హ్యాపీ డేస్ తర్వాత రెయిన్ బో - ప్రేమ ఒక మైకం - లవ్ యూ బంగారం లాంటి సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు రాహుల్.

ఓ దశలో ఇక సినిమాలే చేయను అని కూడా అన్న రాహుల్.. ఆశ చంపుకోలేక ఇక్కడే కంటిన్యూ అవుతున్నాడు. ఐతే ఏదైనా సినిమా కోసం ఇలా ప్యాక్స్ పెంచుతున్నాడో.. లేక ఈ ప్యాక్ లతో అయినా దర్శక నిర్మాతల్ని ఆకర్షిద్దామనుకున్నాడో కానీ.. మొత్తానికి బాడీని పూర్తిగా మార్చేసుకుని సరికొత్త అవతారంలో షాకిస్తున్నాడు ‘హ్యాపీ డేస్’ హీరో. కమ్ముల ‘హ్యాపీ డేస్’ తరహాలోనే తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో హీరోగా పరిచయమైన అభిజిత్ కూడా ఇలాగే సిక్స్ ప్యాక్ పెంచాడు. కానీ దాని వల్ల అయితే అతడి కెరీర్ ఏమీ మారలేదు. మరి రాహుల్ ప్రయత్నం ఎంతవరకు ఫలితస్తుందో చూడాలి.