Begin typing your search above and press return to search.

రెహ్మాన్ సెటైర్ వేశాడా? ఆపండేహా!!

By:  Tupaki Desk   |   22 March 2017 7:16 AM GMT
రెహ్మాన్ సెటైర్ వేశాడా? ఆపండేహా!!
X
ఏదన్నా ఎవరన్నా చిన్నమాటంటే చాలు.. వెంటనే దానిని మన మీడియాలు భూతద్దంలో చూపించేసి.. ఎవ్వరికీ కనిపించని ఘోరం జరిగిపోయిందంటూ రచ్చ చేయడం ఒక రొటీన్ కవాతుగా మారిపోయింది. అదిగో ఇప్పుడు ఏ.ఆర్.రెహ్మాన్ కూడా తెలుగు ఇండస్ర్టీపై ఒక సెటైర్ వేశాడంటూ నానా రచ్చ చేస్తున్నారు మన జనాలు. ఇంతకీ ఆయన ఏమన్నాడో చూద్దాం పదండి.

నిన్న మణిరత్నం ''చెలియా'' సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చిన రెహ్మాన్.. ''ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది. మీకు ఒక బాహుబలి కూడా ఉంది. ఒకప్పుడు తమిళనాడులో ఏవియం స్టూడియోస్ లో తమిళ - తెలుగు - మలయాళం - కన్నడ సినిమాల పనులు ఒకచోటనే జరిగేవి. ఇప్పుడు మాత్రం దూరం అయిపోయాయ్. అయినాసరే తెలుగువారు బాహుబలి తీసి దేశానికే గర్వకారణం అయ్యారు. మీరు ఒకటి కాదు.. సంవత్సరానికి నాలుగు బాహుబలి సినిమాలు తీయాలి'' అంటూ చెప్పుకొచ్చాడు రెహ్మాన్. అదిగో ఇంకేముంది బాహుబలి మీద ఏడుస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతుంటే.. అవే మీడియాకు న్యూసులు అయిపోయాయ్.

నిజానికి రెహ్మాన్ చెప్పింది నిజమే కదా. తెలుగు సినిమాలకు సంబంధించి మనం కథల రూపంలో ఇప్పటివరకు పెద్ద మెగా ఫీట్లు ఏమీ చేయలేదు. మోడ్రన్ తెలుగు సినిమా రంగంలో అమితాబ్ బచ్చన్ కంటే చిరంజీవి ఎక్కువ రెమ్యూనరేషన్ న్యూస్ తీసుకుంటున్నారు అనే వార్త కంటే.. మన సినిమాలేవీ టైమ్ 100 బెస్ట్ ఫిలింస్ లోకి ఎక్కలేదు. కాని తమిళం నుండి అనేక సినిమాలకు అటువంటి పురస్కారాలు అందాయి. అందుకే ఇప్పుడు బాహుబలి సడన్ గా యావత్ ప్రపంచాన్నీ తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. సో తప్పేముంది రెహ్మాన్ చెప్పిందాంట్లో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/