Begin typing your search above and press return to search.

రెహమాన్ ను రుద్దుతున్నారుగా...

By:  Tupaki Desk   |   24 March 2017 8:00 AM GMT
రెహమాన్ ను రుద్దుతున్నారుగా...
X
రీసెంట్ గా రిలీజ్ అయి 16 ఎవ్రీ డీటైల్ కౌంట్స్ మూవీ.. తెలుగు జనాలను బాగానే మెప్పించింది. తెలుగులో ఇప్పటికే అనేక చిత్రాలను చేసిన రెహమాన్ కు.. ఇక్కడ కొత్త ఇమేజ్ ను ఆపాదించిందనే చెప్పాలి. కోలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ సాధించిన ధృవంగల్ పత్తినారు చిత్రాన్ని.. తెలుగులో డబ్బింగ్ చేసి మంచి రిజల్ట్ నే అందుకున్నాడు రెహమాన్.

ఒక సినిమా సక్సెస్ కావడంతో.. ఇప్పుడు రెహమాన్ సినిమాలను వరుసగా దించేస్తున్నారు. ఒరు ముగత్తిరాయ్ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు. గత వారమే ఈ సినిమా తమిళ్ లో రిలీజ్ కాగా.. థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ ఉంటుంది. ఓ సైక్రియాట్రిక్ డాక్టర్.. ఓ సైకాలజీ స్టూడెంట్ ను ప్రేమించి.. ఆ తర్వాత సైకోగా మారడమే ఈ చిత్ర కథ. 16 మాదిరిగా అక్కడ పెద్ద గొప్పగా రివ్యూలు కానీ.. రిజల్ట్ కానీ దక్కలేదు. అయినా సరే.. రెహమాన్ ఇక్కడ సంపాదించుకున్న కాసింత క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించేస్తున్నారు.

జీవా-కాజల్ జంటగా నటించిన కావలై వేండాంను తెలుగులో ఎంతవరకూ ఈ ప్రేమ అనే టైటిల్ తో డబ్బింగ్ చేసిన డీవీ సినీ క్రియషన్స్.. ఒరు ముగత్తిరాయ్ ను కూడా డబ్బింగ్ చేస్తోంది. తెలుగులో గోవిందుడు అందరివాడే లో రామ్ చరణ్ తండ్రిగాను.. జనతా గ్యారేజ్ మూవీలోను నటించిన రెహమాన్ కు.. ఇక్కడ కేరక్టర్ ఆర్టిస్ట్ గా డిఫరెంట్ ఇమేజ్ ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/