ట్రైలర్ టాక్: ఇటు సెక్స్.. అటు దెయ్యం

Thu Sep 14 2017 13:56:26 GMT+0530 (IST)

'సెక్స్ సెల్స్' అంటూ ఒకప్పుడు అడ్వర్టయిజింగ్ రంగం గురించి చెప్పేవారు. అయితే అక్కడ పద్దతులు మారిపోయి ఇప్పుడు క్రియేటివ్ యాడ్స్ ఎన్నో వస్తున్నాయి. కాని ఏక్తా కపూర్ వంటి నిర్మాతలు మాత్రం.. ఈ సెక్స్ చుట్టూ తిరగడం మానట్లేదు. రాగిణి ఎం.ఎం.ఎస్ సినిమా తీశాక.. దానికి సన్నీ లియోన్ తో ఒక సీక్వెల్ కూడా తీసింది. ఇప్పుడు రాగిణి రిటర్స్న్ అంటూ ఒక వెబ్ సిరీస్ తీస్తోంది. పదండి ఈ ట్రైలర్లో ఏముందో చూద్దాం.

కేవలం లోదుస్తుల్లో తన అందాలను ఆరబోస్తూ కరిష్మా శర్మ అనే టివి నటి ట్రైలర్లో బీభత్సంగా రెచ్చిపోయింది అని చెప్పొచ్చు. అక్కడి నుండి ఆమె తన ప్రియుడితో జరిపే సెక్స్ సీన్లలో ఈ ట్రైలర్ అంతా నిండిపోయింది. భయం అనేది మీ బెడ్ రూములోకి వచ్చేస్తోంది అంటూ.. ఇప్పుడు వీరు సెక్స్ చేసుకుంటున్నప్పుడు వెనుక నుండి చూసే ఒక దెయ్యాన్ని దించారు. ఒక కాలేజీలో ఒక దెయ్యం ఉండడం.. అక్కడ వీరి సరససల్లాపాలకు అది అడ్డుపడడం.. కథ పరంగా పెద్ద కొత్తగా లేకపోయినా కూడా.. కరిష్మా శర్మ అందాలు.. అలాగే దిల్నాజ్ ఇరానీ అనే మరో సుందరి న్యూడు లుక్కులతో కిక్కిచ్చారనే చెప్పాలి. రకరకాల భంగిమల్లో రతి ఆస్వాదనతో సీన్లన్నీ నింపేశారులే. ఇందులో రియా సేన్ పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్పులో ఉంచారు.

ఇటు సెక్స్ అటు దెయ్యంతో కూడిన ఈ వెబ్ సిరీస్ ను సుయాష్ వదావ్కర్ తీశాడులే. కాకపోతే 2002లో హాలీవుడ్ లో వచ్చిన 'ది రింగ్' అనే సినిమాను దొబ్బేసినట్లు తెలిసిపోతోంది. ఆ సినిమాలో కూడా ఒక చూడకూడని డివిడి ఒకటి ప్లే చూసి చూస్తారు కొందరు.. అది చూసినోళ్ళు చచ్చిపోతుంటారు. ఇక్కడ కూడా అదే కథ.