Begin typing your search above and press return to search.

సామ్ పై ప్రశంసలు కురిపించిన దర్శకేంద్రులు!

By:  Tupaki Desk   |   20 Jun 2019 8:15 AM GMT
సామ్ పై ప్రశంసలు కురిపించిన దర్శకేంద్రులు!
X
సమంతా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? అందం.. నటనతో పాటు క్రేజ్ కూడా భారీగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంతా. ఇవన్నీ ఒక ఎత్తైతే.. సమంతా ఎంచుకునే కథలు మరో ఎత్తు. చాలామంది హీరోయిన్లకు ఈ క్వాలిటీ ఉండదు. కానీ సమంతా మాత్రం తన ప్రతి సినిమాతో ప్రేక్షకులనే కాదు.. సెలబ్రిటీలను కూడా మాయ చేస్తుంది. తాజాగా సమంతా 'ఓ బేబీ' ట్రైలర్ రిలీజ్ అయింది. ఎప్పటిలాగానే అందరినీ క్లీన్ బౌల్డ్ చేసేసింది.

అప్పుడే దీనికి సెలబ్రిటీల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. శతాధిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు 'ఓ బేబీ' ట్రైలర్ పై స్పందించారు. సమంతాపై ప్రశంసల వర్షం కురిపించారు. "ఓ బేబీ సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. సమంతా 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి గా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది. #OhBabyTrailer" అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు సమంతా మామగారు అక్కినేని నాగార్జున కూడా ప్రశంసలు కురిపించారు. ఓ బేబీ ట్రైలర్ ను షేర్ చేస్తూ "సమంతా మళ్ళీ టార్గెట్ ను కొట్టేలా ఉంది. ట్రైలర్ చాలా నచ్చింది కోడలా" అంటూ ట్వీట్ చేశారు. నవదీప్.. ఈషా రెబ్బా కూడా 'ఓ బేబీ' ట్రైలర్ ను ప్రశంసించారు. 'ఓ బేబీ' జూలై 5న విడుదల కానుంది.